టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త నిన్న ఒక్కసారిగా చిత్ర పరిశ్రమకు ఏంతో షాక్ ఇచ్చింది. ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎందరో అగ్ర నటుల వరుస మరణలతో త్రీవ బాధలో ఉన్నసమయంలోనే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.
ఎంతోమంది స్టార్ హీరోలకు డాన్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్ 1500కు పైగా సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కొరియోగ్రాఫర్‌లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారు కూడా ఈయన శిష్యులే. రాకేష్ మాస్టర్ తెలుగు లో చాలా ఎందరో స్టార్ హీరోలకు కొరియోగ్రర్‌గా చేశారు. ప్రభాస్, రవితేజ, హరికృష్ణ, జగపతి బాబు లాంటి హీరోలకు ఆయన పని చేశారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. మహేష్ బాబు నటించిన ఫస్ట్ సినిమా యువరాజు లో గుంతలకిడి భామ అనే పాటలో లో మహేష్ కృష్ణుడి గెటప్ లో కనిపించారు. ఆ పాటకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే అదే పాటలో మరికొంత భాగం ఆయన కొరియోగ్రఫీ చేశారట. రాకేష్ మాస్టర్ మరణం ఇప్పుడు టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది.