బాలకృష్ణ సినిమాల కథలను మహేష్ బాబు కాఫీ కొట్టి చేసిన సినిమాల గురించి తెలుసా..! సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీర్లో ఇప్పటివరకు ఏ సినిమాను అఫీషియల్ గా రీమేక్ చేయలేదు. ఇదే సమయంలో మహేష్ బాబు రీమేక్ చేయడానికి తన తండ్రి కృష్ణ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్న వాటిలో ఏ సినిమాను రీమేక్ చేయడానికి సాహసం చేయలేదు. ఇదే సమయంలో మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు గతంలో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాల కథలను గుర్తు చేస్తూ ఉంటాయి.
ఆ సినిమాల కథలనుంచి పూర్తిస్థాయిలో కాపీ అనలేము కానీ. ఆ సినిమాల స్ఫూర్తితోనే మహేష్ బాబు కొన్ని సినిమాలు వచ్చాయి.అలా వచ్చిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అసలు విషయంలోకి వెళ్తే మహేష్ బాబు కెరీర్లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంతో పెద్ద హిట్. ఈ సినిమా కథ చూస్తే ఒక ఊరుని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో కొరటాల శ్రీమంతుడు తెరకెక్కించాడు. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని సూపర్ హిట్ చేసింది.
అదే సమయంలో 1984లో బాలకృష్ణ ఇదే శ్రీమంతుడు స్టోరీ తరహాలో ఓ సినిమా చేశారు. సోలో హీరోగా బాలకృష్ణ నటిస్తున్న రోజులవి. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జననీ జన్మభూమి’ అనే సినిమా చేశారు.ఈ సినిమాలో హీరో కోటీశ్వరుడు. ఈ సినిమాలో కూడా హీరో ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరు ప్రజలను సారా, మద్యం నుంచి విముక్తి చేసి మంచి చేయాలని చూస్తాడు. అందుకోసం హీరో ఎన్నో కష్టాలను కూడా భరిస్తాడు. చివరకు ఊరుని బాగు చేయాలన్న తన సంకల్పం నెరవేర్చుకుంటాడు.
‘జననీ జన్మభూమి’ సినిమా అప్పట్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ కొరటాల శివ, మహేష్ బాబుతో ఇదే పాయింట్ తీసుకుని తనదైన డైరెక్షన్తో తెర్కెక్కించిన శ్రీమంతుడు సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.ఇలా మహేష్ బాబు ఈ సినిమానే కాకుండా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం స్టైల్లోనే మహేష్ కూడా తన తండ్రి కృష్ణతో కలిసి ముగ్గురు కొడుకులు అనే సినిమా తీశాడు. ఈ సినిమా కూడా అచ్చం ఎన్టీఆర్- బాలకృష్ణ నటించిన అన్నదమ్ముల అనుబంధం సినిమా కథను పోలి ఉంటుంది. ఇలా మహేష్ తన కెరీర్ లో బాలకృష్ణ చేసిన స్టైల్లోనే రెండు సినిమాల్లో నటించాడు.