మెగా ఫ్యామిలీలో మరో పెళ్లిసందడి నెలకొంది. మెగాబ్రదర్ నాగబాబు కుమారుడు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఈ యేడాది చివర్లోనే వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే లావణ్య మెగా కోడలు అవుతుండడంతో ఇప్పుడు ఆమె గురించి సోషల్ మీడియాలోనూ, నెట్టింట్లోనూ అనేక విషయాలపై సెర్చింగులు జరుగుతున్నాయి. ఆమె ఎవరు ? ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ? ఆమె సినిమాల్లోకి ఎలా ? వచ్చింది ? ఇలా అనేక ఆసక్తికర విషయాలు లావణ్య గురించి బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆమె గతంలో వరుణ్‌తో ప్రేమలో పడడానికి ముందే మరో ఇద్దరు హీరోలతో ప్రేమలో పడిందన్న ఆసక్తికర వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు లావణ్య మొదటి సినిమా హీరో నవీన్ చంద్ర. వీరిద్దరు కలిసి అందాల రాక్షసి సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో తొలి చూపుల ఆకర్షణలో పడి వీరు ప్రేమలో పడ్డారన్న పుకార్లు అప్పట్లో వినిపించాయి.
ఆ తర్వాత ఇంటిలిజెంట్ సినిమాలో తనతో కలిసి నటించిన మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌పై కూడా లావణ్య ఇష్టం పెంచుకుందన్న టాక్ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ సాయితేజ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. వరుణ్‌తేజ్‌ను కాస్త డౌన్ చేస్తూ మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ర్యాఫిడ్ ఫైర్ రౌండ్లో మీకు నచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఎవరు ది బెస్ట్ హజ్బెండ్ మెటీరియల్ అన్న ప్రశ్నకు వెంటనే సాయిధరమ్ పేరు చెప్పింది లావణ్య. ఏ అమ్మాయి అయినా అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయినే భర్తగా కోరుకుంటుంది. ఇక వరుణ్ తేజ్ గురించి చెపుతూ వరుణ్ మంచోడు కాదు అని చెప్పను… కానీ సాయిధరమ్ తేజ్ నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో ది బెస్ట్ అని చెప్పింది. ది బెస్ట్ హజ్‌బెండ్ మెటీరియల్‌గా సాయిధరమ్ తేజ్‌కు లావణ్య ఓటేయడంతో అతడిని బాగా ఇష్టపడిందన్న టాక్ అప్పట్లో బయటకు వచ్చింది.. అది అసలు సంగతి..!