ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది మహానటి సావిత్రి. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న సావిత్రి తెలుగులో అగ్రహీరోలందరని సరసన నటించింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో తమిళ నటుడు జెమినీ గణేషన్‌ని సావిత్రి వివాహం చేసుకుంది. ఆ తర్వాత జెమినీ గణేషన్ కంటే ఎక్కువ స్టార్ హోదా సావిత్రికి దక్కింది. ఇటు తెలుగు అటు తమిళ్లో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
వేలకోట్ల సంపాదన కూడబెట్టిన సావిత్రి ఎన్నో మంచి పనులు చేస్తూ ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది. సావిత్రికి అంత గుర్తింపు రావడం జెమినీ గణేషన్ తట్టుకోలేకపోయాడన్న ప్రచారమూ ఉంది. ఎక్కడికి వెళ్లినా తనకంటే ఎక్కువగా సావిత్రికే ప్రాముఖ్యత ఇవ్వడం భరించలేని జెమినీ గణేషన్ తనలో తానే కుమిలిపోయాడు. ఎలాగైనా సావిత్రి స్టార్‌హోదా పోగొట్టేయాలన్న స్వార్థంతో ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చాడంటారు.
ఇక సావిత్రి మూడు నెలల పాటు కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సావిత్రి అప్పట్లో ప్రవేశపెట్టిన విధివిధానాలను సెన్సార్‌లో ఇప్పటికీ అనుసరిస్తున్నారంటే సావిత్రి ఎంత ముందు చూపుతో ఆలోచించిందో అర్థం చేసుకోండి. అలాంటి సావిత్రి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీర సైనికుల గాథలను భారీ బడ్జెట్ తో సినిమా రూపంలో తెరకెక్కించాలనుకున్నారు. దానికి జెమినీ గణేషన్ అడ్డుపడుతూ ఉన్న ఆస్తులన్నీ సినిమాలకే తగలేస్తే పిల్లల భవిష్యత్తు ఏంటని ? సావిత్రిని దూషించాడట.
అయినా సావిత్రి తన ఆలోచన మార్చుకోలేదు. సావిత్రికి – జెమిని గణేషన్ కి ఈ విషయంపై గొడవలు మొదలయ్యాయట. ఇక అప్పట్లో సావిత్రి వీర సైనికుల గాధని తెరకెక్కించి ఉంటే మన దేశంలో స్టార్ దర్శకురాలిగా సావిత్రి పేరు నిలిచిపోయేది. దర్శకురాలిగా, నిర్మాతగా సక్సెస్ అవకుండా జెమినీ గణేషన్ కావాలని సావిత్రి డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు బయ్యర్లు అతి తక్కువ ధరలకు కొనేలా తెరవెనక కుట్రలు పన్నారట. సావిత్రి తెరకెక్కించిన చిన్నారి పాపలు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా జెమినీ గణేషన్ కారణమంటారు.
సావిత్రిని ఎప్పటికప్పుడు తొక్కేయాలని ఉద్దేశంతోనే జెమినీ గణేషన్ కుట్రలు చేసేవాడని అప్పట్లో టాక్ ఉండేది. అలా సావిత్రిని తొక్కేస్తే ఎప్పటికైనా తన కాళ్ళ దగ్గరికి సావిత్రి వస్తుందని ఈగోతోనే జెమినీ గణేషన్ బిహేవ్ చేసేవాడట. కానీ సావిత్రి తన ఆస్తులన్నీ కోల్పోయి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా జెమినీ గణేషన్ ను ఎప్పుడు సహాయం కోరలేదు. అలాగే ఆమె చనిపోయింది.