నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడంలో నందమూరి తారక రామారావు పాత్ర ఎంతగానో ఉంది. ఆయన తర్వాత వారసులుగా చిత్ర పరిశ్రమలోకి హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిద్దరిలో బాలకృష్ణ మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.
హరికృష్ణ మాత్రం లేటు వయసులో ఎంట్రీ ఇవ్వటం వల్ల కొన్ని సినిమాలకే పరిమితం అయ్యాడు. అలాగే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న వంటి వారు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గతంలో నటించిన పలు సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. ఏ సినిమా చేసిన ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.
ఆ సమయంలో తండ్రి హరికృష్ణ తన కొడుకు సినీ కెరీర్ ఇరకాటంలో పడటం చూసి.. తన కొడుకు ఎన్టీఆర్ జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యునికి చూపించారట. ఇక ఎన్టీఆర్ జాతకం చూసిన ఆ జ్యోతిష్యుడు మీ అబ్బాయి జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని.. వాటికి పరిహార పూజలు చేస్తే కచ్చితంగా తర్వాత సినిమాలు మంచి విజయం అందుకుంటాయని చెప్పారట.
ఇక ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లే హరికృష్ణ తన కొడుకు ఎన్టీఆర్ తో పరిహార పూజలు, హోమాలు చేయించారట. ఇప్పుడైతే హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ తో పూజలు చేయించారు.. అప్పటినుంచి ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలా తన కొడుకు సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడడం చూసి హరికృష్ణ దగ్గరుండి కొడుకు స్టార్ హీరో అవ్వాలని ప్రత్యేక పూజలు చేయించారట.