నందమూరి బాలకృష్ణ 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమాలలో చాలా రీమేక్స్ ఉన్నాయి. అవి అతనికి మంచి హిట్స్ కూడా సాధించిపెట్టాయి. ఆ సంగతి చాలా మందికి తెలియదు. మరి ఆ మూవీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..
నర్తనశాల :
బాలకృష్ణ తన కెరీర్‌లో చేసిన మొట్టమొదటి రీమేక్ సినిమా నర్తనశాల. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించిన డైరెక్షన్ బాధ్యతలను బాలకృష్ణ తీసుకున్నారు.
లయన్ :
బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘లయన్’ మూవీ హాలీవుడ్ సినిమా ‘టోటల్ రీకాల్ (1990)’కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా హిట్ అందుకోలేదు.
ఒక్క మగాడు :
వైవీయస్ చౌదరీ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఒక్క మగాడు’ మూవీ ‘భారతీయుడు’ సినిమా నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుంది. ఈ మూవీ డిజాస్టర్ అయింది.
విజయేంద్రవర్మ :
స్వర్ణ సుబ్బారావు డైరెక్ట్ చేసిన బాలకృష్ణ మూవీ ‘విజయేంద్రవర్మ’ ‘ ది బౌర్నే ఐడెంటిటి’తో పాటు ‘ది లాంగ్ కిస్ గుడ్ నైట్’ వంటి హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొందింది. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది.
లక్ష్మీ నరసింహా :
‘లక్ష్మీ నరసింహా’ సినిమా తమిళ మూవీ ‘సామి’కి రీమేక్‌గా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది.
పలనాటి బ్రహ్మనాయుడు :
బి.గోపాల్, బాలయ్య కాంబో మూవీ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ కన్నడ సినిమా ‘రాజ నరసింహ’ సినిమాకు రీమేక్. కాగా ఈ సినిమా డిజాస్టర్ అయింది.
గొప్పింటి అల్లుడు :
బాలకృష్ణ, ఇవివి సత్యనారాయణ కలిసి తీసిన ‘గొప్పింటి అల్లుడు’ మూవీ ‘హీరో నంబర్ 1’ హిందీ సినిమాకు రీమేక్‌గా వచ్చి పర్లేదనిపించింది.
భైరవ ద్వీపం :
బాలకృష్ణ, సింగీతం శ్రీనివాస రావు కాంబోలో వచ్చిన ‘భైరవ ద్వీపం’ మూవీ ‘పాతాళ భైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’ వంటి నాలుగు సినిమాలలోని కొన్ని సన్నివేశాల నుంచి ప్రేరణ పొందింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది.
ముద్దుల మేనల్లుడు :
కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య హీరోగా యాక్ట్ చేసిన ‘ముద్దుల మేనల్లుడు’ మూవీ తమిళం సినిమా ‘తంగమన రాసా’కు రీమేక్ కాగా ఇది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది.
అశోక చక్రవర్తి :
మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’ సినిమా తీశాడు. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ముద్దుల మావయ్య :
బాలయ్య కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అయిన ‘ముద్దుల మావయ్య’ కూడా ఒక రీమేక్ సినిమా. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘ఎన్ తంగాచ్చి పడిచావా’కి ఇది తెలుగు రీమేక్‌గా వచ్చింది.
మువ్వ గోపాలుడు :
కోడి రామకృష్ణ, బాలకృష్ణ కలిసి చేసిన మరొక బ్లాక్‌బస్టర్ రీమేక్ మూవీ ‘మువ్వ గోపాలుడు’. తమిళంలో ప్రభు చేసిన ‘అరువదై నాల్’ సినిమాకు ఇది రీమేక్.
రాము :
బాలకృష్ణ ‘రాము’ సినిమా తమిళ్ ‘పెర్ సొల్లుమ్ పిళ్లై’ సినిమాకు రీమేక్. ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
బాబాయి అబ్బాయి :
సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వద్దంటే డబ్బు’ సినిమాను బాలయ్య కొద్దిగా మార్చేసి జంధ్యాలతో కలిసి ‘బాబాయి అబ్బాయి’గా రీమేక్ చేశాడు. ఇది కూడా సూపర్ హిట్ అయింది.
మంగమ్మ గారి మనవడు :
కోడి రామకృష్ణ, బాలయ్య కాంబో మూవీ ‘మంగమ్మ గారి మనవడు’ సైతం రీమేక్ సినిమానే కావడం విశేషం. ఇది తమిళ సినిమా ‘మన్ వాసనై’కి రీమేక్‌గా వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.