తెలుగులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి అందరికీ తెలిసిందే. ఆమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువ అవుతుంది. టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోలతో నటించిన అనుష్క తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం అనుష్క సినిమాలకు కాస్త లాంగ్ బ్రేక్ ఇచ్చింది. బాహుబలి వంటి క్రేజీ ప్రాజెక్టు తర్వాత ఈమె నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.
ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క ప్రస్తుతం యంగ్ హీరో
నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న శెట్టి .. పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
మీరు నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంటని ? ప్రశ్నించడంతో తనకు అరుంధతి , వేదం సినిమాలు చాలా ఇష్టమని చెప్పింది. ఈమె టాలీవుడ్లో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన నటించినా ఆమెకు ఈ రెండు సినిమాలంటేనే బాగా ఇష్టమట. నచ్చిన సినిమా ఏదన్న ప్రశ్నకు బాలయ్యతో కలిసి నటించిన ఒక్క మగాడు సినిమా తనకు ఏమాత్రం నచ్చదు అంటూ చెప్పింది.
అనుష్క కెరియర్ లో వచ్చిన అతి పెద్ద గాసిప్ ఏంటని అడగగా.. ఐదుసార్లు పెళ్లవ్వడం అని నవ్వుతూ తెలిపింది అనుష్క. ఆ ఐదుగురు ఎవరంటే గోపీచంద్, ప్రభాస్, సుమంత్, నాగార్జున అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.