‘ దేవ‌ర‌ ‘ లో ఆ ఒక్క సీన్ చాలు… గూస్‌బంప్స్ మోత‌… థియేట‌ర్ల‌లో విజిల్స్ కేక‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ” దేవర‌ ”. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనుంది. ఎన్టీఆర్‌కు త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వ‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా వ‌స్తుందంటే చాలు పాన్ ఇండియా రేంజ్‌లో అంచ‌నాలు ఉంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఏకంగా యేడాది పాటు గ్యాప్ తీసుకుని మ‌రీ దేవ‌ర సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే శ‌రవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. ఈ సెట్‌లో 2 వారాలు పాటు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నారు.

ప్రముఖ స్టంట్స్‌ దర్శకుడు పీటర్ హెయిర్ ఆధ్వ‌ర్యంలో ఈ ఫైట్స్ సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ యాక్షన్స్ ఇన్ సినిమా మొత్తానికే హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సీన్ దెబ్బ‌తో గూస్‌బంప్స్‌తో పాటు థియేట‌ర్ల‌లో విజిల్స్ మోత మోగిపోతుంద‌ట‌. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఓ రేంజ్ లో ఉండబోతుందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కష్టపడుతున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ కొర‌టాల‌ కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు కామ‌న్ సినీ ఆడియెన్స్‌లో కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయడానికి లెంగ్తి షెడ్యూల్ ప్లాన్ చేశాడట కొరటాల. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.