వంద‌ల సినిమాల్లో న‌టించినా ఎన్టీఆర్‌కు తీర‌ని కోరిక‌గా మిగిలిన సినిమా…!

నటరత్న ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలు.. ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. ఆయ‌న ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. పాత్ర‌లో ఒదిగిపోయి జీవించే విష‌యంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఓ సినిమాను చేయాలని ఎంత భావించినా అది తీర‌ని కోరికగానే మిగిలిపోయింది.

వీరే వెండితెర 'అల్లూరి సీతారామరాజులు' | telugu actor who play alluri  seetarama raju

ఎన్టీఆర్ విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా చేయాలని భావించారు. ఆ టైంలో ఎన్టీఆర్ తోడుదొంగలు సినిమా తర్వాత సీతారామరాజు సినిమాలో నటించాల్సి ఉంది. అప్పుడే ఎన్టీఆర్ జై సింహా సినిమాను ప్రకటించడంతో అల్లూరి సీతారామరాజు సినిమా వెనక్కి వెళ్ళిపోయింది.

జై సింహా సినిమా విడుదలయ్యి ఘనవిజయం సాధించాక‌… ఎన్టీఆర్ సీతారామరాజు సినిమా షూటింగ్ మొదలైనా వేర్వేరు కారణాలతో మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పడాల రామారావుని సంప్రదించారు. ఆ క‌థ‌లో హీరోయిన్ పాత్ర లేకపోవ‌వడంతో.. ఆ పాత్ర ఉండేలా ఒక కథ రాయమని కోరారు. ఇంతలో ఒక నిర్మాణ సంస్థ శోభన్‌ బాబుతో అల్లూరి చిత్రాన్ని తెరకెక్కిస్తామంటూ ప్రకటించింది. ఆర్ధిక ఇబ్బందులు వల్ల అది జరగలేదు.

मङ्गलम् on Twitter: "Way before Krishna, the big man of Telugu cinema, NTR  himself acted the role of Raju in a 1955 movie. It flopped. Krishna's movie  did far better, in comparison.

దీంతో ఆ కథ సూపర్ స్టార్ కృష్ణ దగ్గరకి వెళ్ళింది. త్రిపురేని మహారథి ఆ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దగా… 1974లో కృష్ణ 100 వ సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ ఎన్టీఆర్ కి ఆ పాత్రపై మమకారం పోలేదు. ఆ సినిమాలో నటించకపోయినా ప‌లు సినిమాల‌లో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా కాసేపు కనిపించి అలరించారు. అది కూడా ఎన్టీఆర్ ని తృప్తి పరచలేదు. దీంతో స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ని పిలిచి అల్లూరి సీతారామరాజు కథ సిద్ధం చేయమని అడిగారు.

దానికి పరుచూరి బ్రదర్స్ బదులిస్తూ.. ఎన్టీఆర్ ని ఒకసారి కృష్ణ‌ అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలని కోరారు. ఆ సినిమా చూసిన త‌ర్వాత ఎన్టీఆర్, కృష్ణని పిలిచి మరి అభినందించారట. ఆ తరువాత అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాలనే కోరికను పూర్తిగా వదులుకున్నారు. అయితే చివ‌రిగా మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో ఓ పాట‌లో అల్లూరి గెట‌ప్‌లో క‌నిపించి మెప్పించారు.