బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పెళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతోంది. దీపిక బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో కలిసి నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్లో అభిమానులని ఆకట్టుకుంటుంది.
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్, బిజినెస్ రంగంలో కూడా తన సత్తా చాటుతోంది. ఇటు సినిమాల్లో నటించినందుకు రెమ్యునరేషన్‌తో పాటు అటు వ్యాపార రంగంలో కూడా సంపాదిస్తోంది. దీపిక ఏడాదికి రు. 40 కోట్లు సంపాదిస్తుందట. ఈ బ్యూటీ ప్రతి సినిమాకు రు. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
అలాగే యాడ్స్ కోసం రు.7 నుంచి 10 కోట్లు వరకు తీసుకుంటుందని టాక్. ఆమె యేడాది సంపాదన ముందు మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సరిపోరు. ఇక దీపిక షారుక్ ఖాన్ కి జోడిగా నటించిన పఠాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రభాస్ కి జోడిగా ప్రాజెక్ట్ కె లో నటిస్తుంది. ఈ సినిమాలో దీపిక పాత్ర ఓ వండర్‌గా ఉంటుందట. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.