ఇండ‌స్ట్రీని కుదిపేసే న్యూస్‌… దీపికా ప‌దుకొనే విడాకులు.. క్లారిటీ…!

టాలీవుడ్, బాలీవుడ్ లో డివర్స్ న్యూస్ ఎక్కువైపోతోంది. కొంతమంది నిజంగానే విడాకులు తీసుకుంటుంటే… మరి కొంతమందిపై పుకార్లు ఎక్కువైపోయాయి. భారీ సినిమాలతో బిజీగా ఉన్న దీపికా పదుకొనే… ఇటు ఫ్యామిలీ లైఫ్, అటు సినీ కెరియర్ కొన‌సాగిస్తూ వ‌స్తోంది. అటు భర్త ర‌ణ‌వీర్, దీపిక దంపతులు కెరీర్ ప‌రంగా టాప్ లో కొనసాగుతున్నారు. వీరి వివాహ బంధంపై గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

కొంత కాలంగా వీరి మధ్య సఖ్యత పోయిందని.. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కొంతకాలం కిందట ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించింది దీపికా పదుకొనే డైవర్స్ వార్తల పై క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె రణ్‌వీర్‌తో ఫుల్ హ్యాపీ జీవితం ఎంజాయ్ చేస్తున్న‌ట్టు చెప్పింది.

దీపికా పదుకొనే క్లారిటీ ఇచ్చినా కూడా ఆ జంటపై వార్తలు మాత్రం ఆగలేదు. ఈ స్టార్ కపుల్ విడాకులపై చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ అప్లోడ్ చేసింది దీపికా. ఇందులో భర్త రణ్‌వీర్‌తో కలిసి చాలా హ్యాపీగా పడవలో విహరిస్తూ కనిపించారు. ఈ ఫొటోతో తమపై వస్తున్న విడాకుల వార్తల‌కు చెక్ పెట్టేసింది దీపి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ జోడిగా నటిస్తుంది.