వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుందామని ఆశపడ్డా.. ఆ నటి సెన్సేషనల్ కామెంట్స్..!

మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ విశేషమైన అభిమానాన్ని సంపాదించాడు వరుణ్ తేజ్. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే వీరి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. లావణ్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ సూపర్ హాట్‌గా కనిపించి ప్రేక్షకులకు చెమటలు పట్టించింది.

అయితే లావణ్య, వరుణ్ ఎంగేజ్‌మెంట్ తర్వాత వారికి అందరి నుంచి అభినందనలు అందుతున్నాయి. లావణ్య, వరుణ్‌లు చూడముచ్చటైన జంట అని… ఇద్దరూ మంచి జోడి అంటూ చాలామంది సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ యాక్ట్రెస్ వరుణ్ తేజ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మరెవరో కాదు మల్లి సీరియల్ నటి దీపా జగదీష్.

ఈ ముద్దుగుమ్మ సూపర్ క్యూట్‌గా ఉంటుంది. స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న మల్లి సీరియల్‌తో తెలుగు వారికి ఈమె పరిచయమైంది. మంచి లుక్స్ ఉండటంతో తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆల్రెడీ నిశ్చితార్థం జరుపుకున్న వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరుణ్ తేజ్ హైట్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఆమె మాట్లాడింది.

అంతేకాదు, ఫిదా సినిమా చూశాక వరుణ్‌కు తాను చాలా పెద్ద అభిమానిని అయ్యానని తెలిపింది. తరువాత వరుణ్‌ని తాను పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నానంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. నన్ను వదిలేసి లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం చేసుకోవడం తన బ్యాడ్ లక్ అన్నట్లు ఆమె మాట్లాడింది. కాగా దీపా వరుణ్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జోక్ ఏంటంటే దీపాకి ఆల్రెడీ పెళ్లయింది.