అల్ల‌రి న‌రేష్ గాడ్ని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నావా… నిర్మాత‌కు వార్నింగ్‌…!

టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థానాన్ని చాలా వరకు భర్తీ చేశాడు అల్లరి నరేష్. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలలో నటిస్తూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే గత కొన్నేళ్ళుగా కుర్ర హీరోల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో అల్లరి నరేష్ రేసులో వెనుకబడిపోయాడు. ప్రేక్షకులకు అల్లరి నరేష్ చేసే కామెడీ మొహం మొత్తేసింది. దీంతో నరేష్ సినిమాలు సరిగా ఆడటం లేదు.

ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్‌తో యముడికి మొగుడు సినిమాను నిర్మించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల ఈ సినిమా కోసం ఆయన రామోజీ ఫిలిం సిటీలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక యమలోకం సెట్ వేశారు. ఆ రోజుల్లోనే యముడికి మొగుడు సినిమాకు ఏకంగా రు. 12 కోట్ల బడ్జెట్ అయ్యింది. అప్పటికి నరేష్ కు ఉన్న మార్కెట్తో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శక రత్న దాసరి నారాయణరావుతో పాటు దివంగత నిర్మాత రామానాయుడు ఇద్దరు హాజరయ్యారట. వెంటనే దాసరి నారాయణరావు అక్కడ వేసిన యమలోకం సెట్ చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే నిర్మాత చంటి అడ్డాలను పక్కకు పిలిచి ఎరా బుద్ధుందా ? నీకు వాడిని హీరోగా పెట్టి ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీయటం నీకు అవసరమా ? ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తే రేపు రిలీజ్ రోజు ఇబ్బందులు తప్పవు చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారట.

వాడి మార్కెట్ ఎంతో తెలుసుకుని ప్లానింగ్‌తో వెళ్లాలి క‌దా ? అని వార్నింగ్ ఇచ్చార‌ట‌. ఆ తర్వాత రామానాయుడు కూడా నేను సినిమాలను ఓన్ గా రిలీజ్ చేసుకుంటాను.. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు వేరే వాళ్లకు అమ్ముతావు రిలీజ్ కి ముందే నష్టానికి అమ్మితే చాలా ఇబ్బందులు వస్తాయి.. ఆర్థికంగా నష్టపోతావు.. బడ్జెట్ విషయంలో కంట్రోల్తో ఉండు అని హెచ్చరించారట.

వారిద్దరూ అనుకున్నట్టుగానే యముడికి మొగుడు సినిమా డెఫిషిట్లో రిలీజ్ అయింది. సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. దీంతో నిర్మాత చంటి ఆర్థికంగా కొంత నష్టపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వ యంగా ఇంటర్వ్యూలో చెప్పారు.