సినిమాలకు దూరమైన బాలకృష్ణ తమ్ముడు రాజాకు అంత బ్యాక్‌గ్రౌండా.. ఇంత‌కూ ఎవ‌రా హీరో…!

చిత్ర పరిశ్రమలోకి వ‌చ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత అవకాశాలు లేక నటించిన సినిమాలు ప్లాప్ అవడంతో చిత్ర పరిశ్రమకు దూరమైన వారు చాలామంది ఉన్నారు. అలా దగ్గుబాటి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమయ్యాడు.. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ప్రస్తుతం అతడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉన్నాడు వంటి వివరాలు ఇక్క‌డ చూద్దం

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతోమంది ప్రొడ్యూసర్లుగా, హీరోలుగా పరిశ్రమలో రాణిస్తున్నారు. వెంకటేష్, రానా ఇప్పటికే హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా అహింస‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు హీరోలుగా పరిచయం అయింది కేవలం వీరు మాత్రమే కాకుండా మరొక వ్యక్తి కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు.

ఆ హీరో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత కాలంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దూరం అయ్య‌డు. ఆ హీరో మరి ఎవరో కాదు దగ్గుబాటి రాజా.. ఒకప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా తమిళ, మలయాళ, ప‌రిశ్ర‌మ‌లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజాకి దగ్గుబాటి కుటుంబానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..! మూవీ మొగల్ రామనాయుడు అన్న కొడుకే ఈ దగ్గుబాటి రాజా.. కోలీవుడ్ సీనియార్ దర్శకుడు భారతి రాజా దగ్గర నటనలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడగానే ఆకట్టుకునే రూపం దగ్గుబాటి వారసుల సొంతం. ఇక దాంతో రాజా స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు. తెలుగులో కూడా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం, వంటి పలు సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో చెన్నై వెళ్లి తన తండ్రి నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు దూరమయ్యాడు.

మళ్లీ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ సోదరుడు పాత్రలో నటించాడు రాజా. ఇక రాజాకు ఒక కొడుకు కుమార్తె సంతానంగా ఉన్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ దగ్గుబాటి హీరో తన కుటుంబ కలిసి చెన్నైలో ఉంటున్నాడు. అదేవిధంగా దగ్గుబాటి కుటుంబంలో ఎలాంటి శుభకార్యాలు జరిగిన వాటికి హాజరవుతూ ఉంటారు. అయితే రాజాకు ఉన్న మొహమాటం కారణంగానే సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని చిత్ర పరిశ్రమలో ఉండే పెద్దలు అంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం తన వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తూ రాజా ఎంతో బిజీగా ఉన్నాడు.