దగ్గుపాటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రానా గురించి అందరికీ తెలుసు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రానా కొంతకాలం ముంబై భామ మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మిహిక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటు ఫ్యామిలీ అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
రాన కూడా తన ఫ్యామిలీ ఫోటోలను బాగా షేర్ చేస్తాడు. గతంలో మిహికా ప్రెగ్నెంట్ అంటూ అనేక పుకార్లు రాగా వెంటనే వాటికి చెక్ పెట్టింది మిహికా. అంతే కాకుండా తమ విడాకుల గురించి కూడా కొన్ని రకాలుగా పుకార్లు వినిపించాయి. అప్పుడే ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది మిహికా. రానా తన భార్య మిహికా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడడు.
కేవలం రానా దిగిన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మిహికా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్లను మించి అందంగా ఉండడంతో రానా చాలా అదృష్టవంతుడు అని.. టాలీవుడ్‌లో అడుగు పెడితే మాత్రం స్టార్ హీరోయిన్ కావడం పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ రానాకు తన భార్య హీరోయిన్ అవడం ఇష్టం లేదట. సాధారణ అమ్మాయి లాగానే సాంప్రదాయబద్ధంగా ఇంట్లో ఉంటే చాలనే రానా ఫీలవుతాడట.
దీని వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది. హీరోయిన్ అయితే ఇతరులతో రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వస్తుంది. దాంతో పాటే మోడల్ ఫోటోషూట్ గ్లామర్ షోస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి రానకు ఇష్టం లేదని.. తన భార్య సాంప్రదాయ బద్ధంగా ఉంటేనే ఇష్టమని.. అందుకే సినిమాలు, వెబ్‌సీరిస్‌లు, గ్లామర్ ఫీల్డ్‌కు పూర్తి దూరంగా ఉంచుతున్నాడని అంటూ ఉంటారు.