బిగ్‌బాస్ 7 హౌస్‌లోకి స్టార్ క్రికెట‌ర్‌.. ఈ సారి ర‌చ్చ మామూలుగా ఉండ‌దే..!

తెలుగులో ద బిగ్గెస్ట్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్‌బాస్. ఇప్పటివరకు నిరంతరాయంగా 6 సీజన్ల‌ను స‌క్సెస్‌గా పూర్తి చేసిన ఈ షో 7వ‌ సీజన్లోకి అడుగుపెట్టబోతుంది. తాజాగా బిగ్‌బాస్ 7 ప్రోగ్రామ్‌పై ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు బిగ్‌బాస్ టీం. దీంతో ఈ సీజన్లో నాగార్జున హోస్ట్‌గా నిర్వహించబోతున్నాడ‌న్న విషయం అర్థమైపోయింది.

ఇప్పటికే బిగ్ బాస్ 7 లో పార్టిసిపెంట్స్ లిస్ట్ తయారైపోయిందంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 కొత్త ట్రెండు సెట్ చేయబోతోంది. ఇప్ప‌టికే గ‌త‌ సీజ‌న్లో ఎంతో మంది బుల్లితెర న‌టీమ‌ణులు, న్యూస్ ప్ర‌జెంట‌ర్లు, యాంక‌ర్లు, వెట‌ర‌న్ హీరోయిన్లు, ఫేడ‌వుట్ హీరోలు, హీరోయిన్లు హౌస్‌లోకి వెళ్లారు.

ఇక ఈ సీజన్లో స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఉంటుంద‌న్న‌ వార్తలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బిగ్‌బాస్6 ఓటీటీ రిలీజ్ చేయగా ఓట్ల విషయంలో తిరకాసు జరిగిందంటూ విమర్శలు వచ్చాయి. ఈ సీజన్లో అలాంటి విమర్శలు రాకుండా స్టార్ మా టీం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంద‌ట. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో స్టార్ క్రికెటర్ అడుగు పెట్టింది లేదు. కాగా ఈ సీజన్ ఎలాగైనా హైలెట్ చేయాలని ఉద్దేశంతో బిగ్ బాస్ టీం స్టార్ క్రికెటర్ ను సెలెక్ట్ చేసింద‌ని టాక్ ?

ఇంతకీ ఎవరా ? స్టార్ క్రికెటర్ అనుకుంటున్నారా ? క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వేణుగోపాలరావు. అత‌డు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్లో కూడా ఆడాడు. అతడిని ఈ మెగా గేమ్ షో కి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంద‌ట స్టార్ మా. దీంతో ఈసారి బిగ్ బాస్ 7 వేరే రేంజ్ లో ఉండబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.