నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గ్లోబల్ లయన్ గా చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాస్తున్న ఈ నందమూరి హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వయసు పెరుగుతున్న కొద్ది బాలయ్యలో ఎనర్జీ లెవెల్ పెరుగుతూ వస్తుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు కమిట్ అవుతూ నందమూరి అభిమానులకు ఫుల్ కిక్కిస్తూ కమిటైన సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్తూ భారీ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు.
ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. ఆయనకు కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీలా నటిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మెగా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ దర్శక తమల తన 109వ సినిమాను కమిట్ అయ్యాడు.
ఇక ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఈ రీసెంట్ టైమ్స్ లో తమన్నా సీనియర్ హీరోలకు జంటగా నటించేందుకు బాగా ఇష్టపడుతుంది.
ఇక ఇప్పుడు ఏదేమైనా సరే మాస్ హీరో బాలయ్య పక్కన మిల్కీ బ్యూటీ తమన్న జత కడితే ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇక అంతేకాకుండా ఈ సినిమాల్లో మరో హీరోయిన్ కూడా ఉందని.. ఆ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరి బాబి బాలయ్యని ఏ రీతిలో చూపిస్తాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..!!