బాల‌య్య ‘ భ‌గ‌వంత్‌ కేసరి ‘ పై అదిరిపోయే అప్డేట్… ఆ సీన్‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందే..!

నటసింహ నందమూరి బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతుంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్యని ఎలా ? చూపిస్తాడా అన్న‌ అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇటీవల బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మూవీ టీం.

ఈ టీజర్ లుక్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడుతూ డైలాగులు చెప్పడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ను ఓ రేంజ్‌లో పవర్ఫుల్‌గా డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి.

ఇందులో భాగంగానే బాలయ్య, శ్రీ లీల‌, కాజల్ ముగ్గురు కలిసి ఒక అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ముగ్గురు కలిసి వేసిన డాన్స్ ఫ్యాన్స్ కి మంచి ఊపు తెచ్చే విధంగా ఉంటుందని టాక్. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న‌ రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం.

షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహో గారపాటి, హరీష్ పెద్ది ప్రొడక్షన్లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. కాజల్ – బాలయ్య కాంబినేషన్లో మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.