టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు తన ఇన్‌స్టాగ్రామ్ లో భర్తతో కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేయడం మరిన్ని సందేహాలను రేకెత్తించింది. యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన స్వాతి నాని హీరోగా వచ్చిన అష్టాచెమ్మా సినిమాతో హీరోయిన్గా మారింది.
ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ లాంటి హిట్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో పలు సినిమాలో నటించిన హిట్ కాకపోవడంతో తమిళం, మలయాళం సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల స్వాతి పంచతంత్రం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘ మంత్ ఆఫ్ మధు’ సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్ తో ‘ సత్యా ‘ అనే షార్ట్ ఫిలింలో నటించింది.
ఈ షార్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా స్వాతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుర్ఖాతో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో కలర్స్ స్వాతి ఎక్కడికో ప్రయాణమవుతూ కనిపించింది. సీక్రెట్ గా బుర్ఖా ధరించి వెళుతూ దొరికిపోవడంతో ఇలా దొంగచాటుగా బుర్ఖా వేసుకొని అంత సీక్రెట్‌గా వెళ్ళవలసిన అవసరం ఏముంది ? అనే అనుమానాలు సహజంగానే మొదలయ్యాయి.
కాని ఇదంతా కేవలం స్వాతి ఫన్ కోసమే చేసిందట. స్వయంగా ఈ వీడియో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ట్రైన్ ఎక్కిన తర్వాత బుర్ఖా తీసేసి నార్మల్గా చీర కట్టుతో కనిపించింది. ఫిల్టర్ కాఫీతో ఈ వీడియో పూర్తయింది. ప్రస్తుతం విడాకులు వార్తలు వైరల్ అవుతున్న టైంలో ఇలా బుర్ఖాతో కలర్స్ స్వాతి ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులకు కాస్త కొత్తగా అనిపించింది.
View this post on Instagram