నాని హీరోగా వచ్చిన అష్టా చమ్మ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి. అంతకుముందు యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుంది. ఇక కలర్స్ స్వాతి హీరోయిన్‌గా అవకాశాలు అందుకొని మంచి విజయాలు వచ్చినా వరుస సినిమాలో నటించలేకపోయింది.
సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిల్ అయింది. ఈ విధంగా కలర్స్ స్వాతి విడాకులు తీసుకోవడం వల్లే ఇండియాకు వచ్చేసి తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. గతంలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా బిజీ అయినప్పటికీ ఈమె అవకాశాలు కోల్పోవడం వెనక ఓ వ్యక్తి ప్రమేయం ఉందని తెలుస్తుంది.
చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగాలంటే కొన్నిసార్లు మనం పెట్టుకున్నటువంటి హద్దులను కూడా చెరిపేయాల్సి ఉంటుంది అప్పుడే హీరోయిన్‌గా మంచి విజయాలు అందుకోగలం. అయితే కలర్స్ స్వాతి సినిమాలు చేసే సమయంలో తన తల్లి తనని విడిచిపెట్టి ఉండేవారు కాదట. ప్రతి విషయంలోనూ ఈమెను అంటిపెట్టుకొని ఉండటమే కాకుండా తనని ఎవరితోనో మాట్లాడనివ్వకుండా కట్టడి చేసేవారట.
అలాగే కొన్ని గ్లామర్ సన్నివేశాలలో కూడా నటించడానికి కూడా ఆమె ఒప్పుకునే వారు కాదట. ఇలా ప్రతి విషయంలోనూ ఆమె కండిషన్లు పెరగటం కారణంగా దర్శక నిర్మాతలు ఆమె పట్ల విసుగు చెంది కలర్స్ స్వాతికి ఛాన్సులు ఇవ్వ లేదట. కేవలం తన తల్లి కారణంగానే కలర్స్ స్వాతి సినిమా అవకాశాలు కోల్పోయి తన కెరీర్ నాశనం చేసుకున్నారనే వార్త ప్రస్తుతం ఎంతో వైరల్ గా మారింది.