చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావటమే గొప్ప విషయమైతే వచ్చిన తర్వాత ఆయన తన క్రేజ్‌ను పెంచుకోవడం ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పదులకోద్ది హీరోలు వచ్చేలా చేసుకోవడం నిజంగా ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ స్థాయికి రావటం వెనక ఎంతో కష్టం బాధ ఓపిక అన్ని ఉండాలి.
అయితే అలాంటి ఓపిక ఉన్న చిరంజీవికి సైతం విసుగు తెప్పించింది. స్టార్ హీరో భార్య ఎంతో చికాకు తెప్పించిందట. ఈ క్రమంలోనే హద్దులు మీరిన హీరో భార్యను చెప్పుతో కొట్టాలనుకొని కొట్టలేక ఆగిపోయాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ అప్పట్లో ఒక వార్త వైరల్ గా మారింది. అవును మీరు వీటుంది నిజమే మెగాస్టార్ చిరంజీవి ఎంతో నెమ్మదిగల వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే.
ఆయనపై ఎలాంటి ఫేక్ వార్తలు రూమార్లు వచ్చినా.. ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వినిపించినా ఎంతో సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతారు. అలాంటి చిరంజీవికి సైతం కోపం తెప్పించింది తెలుగులో ఉండే ఓ స్టార్ హీరో భార్య. అసలు విషయం ఏమిటంటే చిరు భార్య సురేఖను పదేపదే టార్గెట్ చేస్తూ ఆ హీరో భార్య ఎప్పుడు కించపరిచేదట. ఇటీవలే విడాకులు తీసుకున్న నిహారిక పెళ్లిలో కూడా కూడా చిరు భార్య సురేఖను ఆమె దారుణంగా అవమానించిందట.
టాలీవుడ్ లో ఉన్న మాక్సిమం అందరూ హీరోలు భార్యలు వ్యాపారాలు చేస్తూ వారి భర్తలకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు.. చిరు భార్య సురేఖ మాత్రం తన భర్త సంపాదించిన డబ్బుతో బతికేస్తుందని ఆమెను అవమానించే విధంగా కామెంట్లు చేసిందట. ఈ క్రమంలోని ఇన్నాళ్లు ఓపిక పట్టిన చిరంజీవి ఫైర్ అయిపోయి పరోక్షంగా ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసాడట. చదువుకుంటేనే ఉద్యోగాలు చేస్తున్నే సంస్కారం వస్తుందని నేను అనుకోవటం లేదు.. సురేఖ లేకపోతే మెగా కుటుంబం లేదు డబ్బు విషయంలో ఆమెకి ఎలాంటి కొదవలేదు.
మంచి గుణం మంచి టాలెంట్ అన్నిటికన్నా ఓపిక సహనం ఎక్కువ.. అమ్మాయికైనా అబ్బాయి కైనా ఆ ఓపిక సహనమే ఉండాలి అదే జీవితంలో మనల్ని మనం అనుకున్న స్థాయికి తీసుకు వెళుతుంది. నేను ఇన్ని మెట్లు పైకి ఈ స్థాయిలో ఇలా ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం నా వెనకాల నా భార్య నాకు సపోర్ట్ గా ఉంది. నేను మెగాస్టార్‌ను అయితే నా భార్య కూడా మెగాస్టార్ అంటూ గర్వంగా చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే చిరంజీవి ఆమెకి చెప్పుతో కొట్టకుండానే చెప్పుతో కొట్టినంత నొప్పి క్రియేట్ చేశారని అప్పట్లో అభిమానులు ఈ వార్తను వైరల్ చేశారు.