మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ కొట్టారు. ఇక వచ్చే నెల 11న భోళాశంకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు కాగా.. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. చిరు, తమన్నా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ సాంగ్ ట్యూన్ విటుంటే గతంలో చిరు పాత పాటల ట్యూన్లు గుర్తుకు వచ్చేస్తున్నాయి. చిరుకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఎన్నో మంచి ట్యూన్స్, చార్ట్ బస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు భోళాశంకర్ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ మ్యూజిక్ ఇస్తున్నారు.
ఇక చిరు సినిమాకు మహతి ఇచ్చిన డ్యూయట్ సాంగ్ పక్కా వింటేజ్ మణిశర్మ ట్యూన్‌లోనే వచ్చింది. అచ్చా.. అచ్చ తెలుగు పచ్చి మిర్చి మొగాడు వీడు.. బొంబాట్ ఘాటు.. హాటు గున్నాడే… అని ప్రారంభమైన ఈ పాట రామజోగయ్య శాస్త్రి రాయగా మహతి స్వరసాగర్ పాడడం విశేషం. మహతితో పాటు విజయ్ ప్రకాష్..సంజన కూడా తమ గొంతు కలిపారు.
పంచదార చిలకలాంటి ప్యారీ సుకుమారి అనే లైన్లు వింటుంటే పాత మణిశర్మ పాటలు గుర్తుకు వస్తాయి. పాట చాలా కలర్ ఫుల్లుగా ఉన్నా ఆ స్టెప్పులు, లొకేషన్లు, తమన్నా, చిరు డ్రెస్సులు ఖైదీ నెంబర్ 150 సినిమాలో సాంగులను గుర్తుకు తెచ్చాయి. ఒక్కటి మాత్రం కాస్త ఉపశమనం పాట ట్యూన్ పాతగా ఉన్నా క్యాచీగా ఉండి వినడానికి బాగుంది.