సెట్స్ లో అందరి ముందు సిల్క్ స్మిత ను చెంపపై లాగి కొట్టిన చిరంజీవి.. అసలేం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్టార్ట్డం వచ్చిన తర్వాత మెగాస్టార్ ఎంతోమందికి డైరెక్టర్స్ కి కెరీర్ పరంగా సహాయం చేశాడు. ఇక సింగర్, లిరిక్ రైటర్ కనగాల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి – సిల్క్ స్మితల గురించి కొన్ని ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

సిల్క్ స్మితకు స్టార్ స్టేటస్ వచ్చిన తరువాత ఓ సినిమా షూటింగ్లో మేమిద్దరం కలిసాము అని.. సిల్క్ స్మిత నన్ను పిలిచి మీరేమిటి ఇక్కడ అని అడగగా నేను కో డైరెక్టర్ అని చెప్పానని.. ఎక్కడ చూసినట్టుందే అని సిల్క్ స్మిత అడిగిందని.. చిరంజీవి సినిమాలో మనం కలిసాం కదా అంటూ ఆమె ప్రశ్నించింది అవునని నేను సమాధానం చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ సినిమా బాగా ఆడిందా అని సిల్క్ స్మిత అడిగింది నేను అవునన్నాను అని వివరించాడు. గతంలో ఆమెకు నా వల్ల ఓ సినిమా అవకాశం పోయిందని అందుకే ఆమె నన్ను పిలిచి వెటకారంగా మాట్లాడడానికి అలా మాట్లాడిందంటూ వివరించాడు.

ఇక అప్పుడు జరగబోయే షూటింగ్లో చిరంజీవి , సిల్క్ స్మితను కొట్టాలి. ఆ సన్నివేశాన్ని నేను ఆమెకు వివరిస్తుంటే ఇప్పుడు చిరంజీవి నన్ను కొడతాడా..? చిరంజీవి నన్ను కొట్టకుండా సీన్ తీయడం కుదరదా..? అంటూ నన్ను టీజ్ చేసిందని ఆ తరువాత చిరంజీవి సిల్క్ స్మితను కొట్టే సీన్ రానే వచ్చిందని.. స్మిత నన్ను టీజ్ చేసిన సంగతి చిరంజీవి గారికి తెలిసి ఆ సన్నివేశంలో చిరంజీవి.. సిల్క్ స్మిత నిజంగానే గట్టిగా చెంపపై కొట్టాడని వివరించాడు కనగాల. చిరంజీవి ఆమెను కొట్టిన మరుసటి రోజు 9 గంటల వరకు షూటింగ్ ఉంటే 6 గంటలకే వెళ్ళిపోతానని అడిగిందని మేము కుదరదని చెప్పడంతో మందు తాగి షూటింగ్లో పాల్గొంది అంటూ వివరించాడు.