మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో 150కు పైగా సినిమాలలో నటించి ఎందరో దర్శకులకు అవకాశం ఇచ్చారు ఎందరో దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఉన్న ఓ సీనియర్ దర్శకుడు తో ఎన్నిసార్లు సినిమా చేయాలని ప్రయత్నించిన అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ దర్శకుడు ఎవరో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు విలక్షణ సినిమాలతో తనకుంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి – చిరంజీవి కాంబినేషన్లో సినిమా మిస్ అయిందని సంగతి ఎవరికీి తెలియదు. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
“చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేయాలని ప్రయత్నించిన కుదరలేదు. చిరంజీవి గారి కోసం రెండు కథలు సిద్ధం చేసి ఆయనకు చెప్పాను. ఆయన కూడా వాటికి ఒకే చెప్పినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలు మధ్యలోనేే ఆగిపోయాయి. చిరంజీవి గారితో సినిమా అంటే చాలా స్పెషల్ గా ఉండాలి ఏదో ఒక చిన్న కథను తీసుకొచ్చి చిరంజీవితో సినిమా తీయలేం కదా. అంతేకాకుండా చిరంజీవి గారు ఉంటే నాకు ఎంతో ఇష్టం. నేను నటించిన మొదటి సినిమాకి ఆయన ఎంతో సపోర్ట్ కూడా చేశారు.
ఆయన లేకపోతే నా మొదటి సినిమా విడుదల అయ్యేదే కాదు. అలాంటి చిరంజీవి గారితో ఎప్పటికైనా నేను సినిమా తీయాలనేదే నా కోరిక. చిరంజీవి గారు ఇప్పుడు అవకాశం ఇస్తే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాని ..” ఎస్వి కృష్ణారెడ్డి తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. చిరంజీవి ఎస్వి కృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారా..? లేదా..? అనేది చూడాలి.