చిరంజీవి – బాలయ్య కలిసి నటించిన సినిమా తెలుసా… రెండో సినిమా కూడా జ‌స్ట్ మిస్‌..!

మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలయ్య ఈ రెండు పేర్లకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు చిరు, బాల‌య్య‌. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి చాలామంది ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచాడు.

ఎన్టీఆర్ వార‌సుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మరో హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు బాలయ్య. అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో ఉన్న బాల‌య్య ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపిస్తాడు.

వృత్తిప‌రంగా బాల‌య్య‌, చిరు సినిమాల మ‌ధ్య ఎంత పోటీ ఉంటుందో తెలిసిందే. గతంలో బాలయ్య, చిరంజీవి కలిసి ఓ సినిమాలో నటించారని మీకు తెలుసా? ఇంతకీ ఏంటా? సినిమా అనుకుంటున్నారా. వెంకటేష్ హీరోగా న‌టించిన త్రిమూర్తులు. ఈ సినిమాలో చిరంజీవి – బాలకృష్ణ కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, శోభన్ బాబు కూడా ఈ సినిమాలో మెరిశారు. ఈ సినిమా తర్వాత మళ్లీ బాలయ్య – చిరంజీవి కాంబినేషన్‌లో ఏ సినిమా రాలేదు.

ఇప్పటికి చిరంజీవి – బాలయ్య మంచి కథ దొరికితే ఆ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నార‌ట‌. ఇప్పటివరకు అలాంటి కథ ఏది వీరి వద్దకు రాలేదు. మ‌ధ్య‌లో కె. రాఘ‌వేంద్ర‌రావు వీరి కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ తీసేందుకు ట్రై చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక రాబోయే కాలంలో అయినా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని చాలామంది నందమూరి, మెగా అభిమానులు ఆశ పడుతున్నారు.