ఛీ ఛీ.. రష్మిక ఈవినింగ్ స్నాక్ గా అవి తింటుందా.. నేషనల్ క్రష్ కి ఈ ద‌రిద్రమైన అలవాటు ఉందా..?

నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చిన్న చిన్న సినిమాలను నటిస్తూనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చినా ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ న్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈమె గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆమెపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి? ఆ న్యూస్ అనుకుంటున్నారా. హీరో నితిన్ తో కలిసి రష్మిక భీష్మ అనే సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో స్టార్ హోదాను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా ఛాన్స్ లు దక్కడంతో టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉంది రష్మిక. ఇక ర‌ష్మిక – నితిన్‌తో కలిసి చేసిన భీష్మ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

అప్ప‌ట్లో నితిన్ – రష్మిక కలిసి ఆ సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ రష్మిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ఎవరైనా ఈవినింగ్ స్నాక్స్ గా చిప్స్ లేదా జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారని.. రష్మిక మాత్రం కుక్క బిస్కెట్లు తింటుంది అంటూ చెప్పుకొచ్చాడు. పక్కనే ఉన్న రష్మిక ఆ విషయాన్ని చెప్పొద్దు అంటున్న కూడా ఈ సీక్రెట్ రివీల్ చేశాడు నితిన్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కుక్కలు తినే బిస్కెట్లు కుక్కలు తింటే తప్పేముంది అంటూ నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ పాడు అలవాటు ఏంటి ఛీ ఎలా తింటున్నావమ్మ తల్లి.. నీకు ఈ ద‌రిద్రం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!