ఏపీలో ఎన్నికలకు మరో పది మాసాల గడువు మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని.. టీడీపీ గట్టిగా నిర్ణయించుకుంది. అదేసమయంలో వైసీపీ కూడా వైనాట్ 175 నినాదంతో ముం దుకు సాగుతోంది. అయితే.. ఏ పార్టీ ఎలా నిర్ణయించుకున్నా.. ఎన్నికలను తెరచాటున ఉండి నడిపించే శక్తులు కొన్ని ఉంటాయి. వాటి నిర్ణయం ప్రకారమే అంతో ఇంతో ఎన్నికలు ప్రభావితం అవుతుంటాయి.
ఇప్పుడు అలాంటి శక్తులు అన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదేమీ రాజకీ యాలకు సంబంధించిన విషయం కాదు.. రాజకీయాలకు అతీతంగా కంపెనీలు, వ్యాపారులు, పెట్టుబడి దారులు… టీడీపీకి దన్నుగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ విషయాన్ని వైసీపీనే గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న సర్వేల్లో.. టీడీపీకి అనుకూల పరిణామాలపైనా వైసీపీ దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో ప్రధానంగా మూడు రంగాలవారు.. టీడీపీకి దన్నుగా ఉన్నట్టు స్పష్టమైంది. 1) ఐటీ కంపె నీలు, 2) రియల్ ఎస్టేట్, 3) పెట్టుబడులు పెట్టిన వారు. ఐటీ పరిశ్రమకు ఏపీలోని విశాఖ పట్టుకొమ్మ. చం ద్రబాబు హయాంలో ఇక్కడ శివనాడార్ కంపెనీ నుంచి అనేక సంస్థలువచ్చి వేల కోట్ల రూపాయల పెట్టు బుడులు పెట్టారు.అయితే.. ప్రభుత్వం మారాక. వారి పరిస్తితి ఇబ్బందిలో కూరుకుపోయింది. అలాగే.. రియల్ ఎస్టేట్ రంగం కూడా.
చంద్రబాబు హయాంలో ఎక్కడ వెంచర్ వేసినా. రియల్ రంగం పరుగులు పెట్టింది. అనేక మందికి ఉపా ధి కల్పించింది. అయితే.. వైసీపీ వచ్చీరావడంతోనే కూల్చివేతలు.. కాల్చి వేతలు అన్నట్టుగా పరిస్థితిని మార్చేసింది. దీంతో ఎక్కడా కూడా అభివృద్ధి అనే మాట కూడా లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా మళ్లీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. ఇక., పెట్టుబడి దారులు కూడా.. ఇదే అభిప్రాయంతో ఉన్నారు. “ఈ ఒక్కసారి చంద్రబాబు వస్తే చాలు“ అనే మాట ఎక్కువ మందిలో వినిపిస్తుండడం గమనార్హం.