టీడీపీ అధినేత చంద్రబాబు గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను.. తత్తరపాటు నిర్ణయాలను ఆయన ఎండగడుతున్నారు. ప్రజావేదిక కూల్చడం.. అమరావతిని అణిచేయడం.. ఇలా..అన్ని విషయాలను చంద్రబాబు స్పృశిస్తున్నారు. అయితే.. ఆయా అంశాలపై జనాలు పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. ఏదో వింటున్నారు… ఏదో చర్చిస్తున్నారు.. అప్పటితో అయిపోతోంది.
అయితే.. ఇటీవల కాలంలో సీఎం జగన్.. తరచుగా తనను ఒంటరివాడిని చేసి తోడేళ్లలాగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని.. తాను పేపరు.. పెన్ను.. మీడియా.. మైకు లేనివాడినని.. అందుకే తనపై తీవ్రస్థాయి లో విమర్శలు రాస్తున్నారని.. టీడీపీ అనుకూల మీడియా తనను బద్నాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇటీవల మార్కాపురం సహా అనంతపురంలో నిర్వహించిన సభల్లోనూ.. జగన్ ఇలానేచెప్పారు.
ఈ విషయంపై అదేసమయంలో స్పందించిన చంద్రబాబు జగన్ పేదవాడా? అంటూ.. కామెంట్లు చేస్తు న్నారు. అదే సమయంలో జగన్ ఆస్తుల చిట్టాను కూడా ఆయన వెల్లడిస్తున్నారు. జగన్‌కు 100 లక్షల కోట్ల ఆస్తిపైనే ఉందని.. చంద్రబాబు చెబుతున్నారు. ఒక్క సాక్షి మీడియా నే 10 లక్షల కోట్లు ఉంటుందని.. చెప్పారు. అదేవిధంగా తాడేపల్లి-పులివెందుల-కడప-ఇడుపుల పాయ-బెంగళూరు-ఢిల్లీ సహా.. దేశవ్యాప్తంగా అనేక ఎస్టేట్లు ఉన్నాయని.. ఇవి 50 లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు.
ఇక్కడితో కూడా ఆగకుంగా.. బ్రిటన్‌లో కూడా . జగన్ ఆస్తులు పోగేస్తున్నారని.. ఇక్కడ నుంచి వస్తున్న మద్యం కమీషన్లను అక్కడకు తరలించి.. అక్కడ కూడా ప్యాలెస్ కట్టారని.. అక్కడే ఉండి వస్తున్నారిని ఏటా టూర్ కూడా అక్కడి కి వెళ్తున్నారని.. చెప్పుకొచ్చారు. ఇక, భారతి సిమెంట్స్, ఇందూర్ పవర్ ప్లాంటు .. ఇందిరా టెలివిజన్ సహా అనేక సంస్థలకు జగన్ యజమాని అని.. చంద్రబాబు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం.. జగన్ ఆస్తులపై ప్రజల్లో జోరుగా హోరుగా చర్చ సాగుతుండడం గమనార్హం.