నిహారిక తన భర్త చైతన్య విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం నిజమే అయింది. అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇకనుంచి ఎవరిదారుల్లో వారు జీవించనున్నారు. సహజంగానే మెగా అభిమానులలో ఎక్కువమంది నిహారిక కు సపోర్టుగా.. ఆమె మాజీ భర్త చైతన్య పై మాటల యుద్ధం చేస్తున్నారు. కొందరు మాత్రం నిహారిక తప్పు ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే నిహారిక మాజీ భర్త చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి సన్నిహితుల వద్ద చెప్పుకున్న విషయాలు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. తను ఎంతో గౌరవప్రదంగా బ్రతికిన వ్యక్తిని అని.. నా ఇంట్లోనే నా మాటకు విలువ లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
నిహారికకు ఇంట్లో పెద్దవాళ్లపై గౌరవం లేదు.. భర్త పై ప్రేమ అసలు లేదు.. సంసారం చేసే ఆలోచన కూడా లేదు.. ఎప్పుడు సోషల్ మీడియా అంటూ బయటికి వెళ్లిపోవడం.. క్లబ్బులు పబ్బులలో తిరగటం తప్ప కుటుంబం గురించి ఆలోచించలేదని.. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం కలిగిన కుటుంబం అని తాను భావించానని.. కానీ ఇప్పుడు మా కొడుకు గురించి మెగా అభిమానులు తప్పుగా మాట్లాడుతుంటే సహించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిహారిక సోషల్ లైఫ్ కి తాను ఎప్పుడు అడ్డు చెప్పలేదని.. కానీ ఒక గొప్పింటి ఆడపడుచు గా తన ఇంటి కోడలుగా వచ్చినప్పుడు కాస్త హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని.. ఆ మనిషి ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయిందని కూడా ప్రభాకర్ రావు అన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభాకర్ రావు మాటల సంగతి ఎలా ? ఉన్నా మెగా ఫ్యామిలీలో కూతుళ్ళ అతిగారాబాలవల్లే వారి సంసారాలు నాశనం అవుతున్నాయి అన్నది మాత్రం పబ్లిక్ గా వినిపిస్తున్న టాక్.