నిద్రపోయేటప్పుడు చాలామంది తల కింద దిండు పెట్టుకుని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండును పెట్టుకుని పడుకుంటే ఏమీ కాదు. అదే ఎక్కువ ఎత్తు ఉన్న దిండి ని పెట్టుకుని పడుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి చేరుతాయి.
అవి మొదటలో తెలియదు. కొన్ని రోజులు పోయిన తరువాత ముందుగా మెడ నొప్పి ఏర్పడుతుంది. ఈ నొప్పి చాలా బాధ పెడుతుంది. కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే వెన్ను నొప్పితో బాధపడతారు. మీకు అలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తైన దిండు ఉపయోగించకుండా సరిపడా ఉండేదిండిని ఉపయోగించండి.
దీనివల్ల వెన్నుముక నిలబడడం మెడ సాఫీగా ఉండడం వల్ల నొప్పి రాకుండా ఉంటుంది. దిండు లేకుండా పడుకున్నా ఏమీ కాదు కానీ. ఎత్తైన దిండు పెట్టుకుని పడుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఎక్కువ శాతం దిండు లేకుండా పడుకోవడానికి ప్రయత్నించండి.
ఎత్తైన దిండు పెట్టుకోవడం వల్ల తలకి బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగదు. అందు గురించి జుట్టు ఊడిపోవడం, ఊడనిచోట జుట్టు రాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల పలుచటి దిండిని ఉపయోగించండి.