బ‌న్నీ ఆ ప‌ని చేస్తే స్నేహారెడ్డికి అస్స‌లు న‌చ్చ‌దా… రెండు రోజులు మొహం చూడ‌దు.. మాట్లాడ‌దా…?

టాలీవుడ్‌లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, అత‌డి భార్య స్నేహారెడ్డికి ఎంతో ఫాలోయింగ్ ఉంది. బ‌న్నీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఓ స్టార్ హీరోకు భార్య‌గా ఉన్న స్నేహారెడ్డికి కూడా సోష‌ల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆమె సోష‌ల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా క్ష‌ణాల్లోనే కామెంట్లు, లైకుల వ‌ర్షం కురుస్తుంది. తాజాగా స్నేహారెడ్డి గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బ‌న్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడూ ఎంతో ఫన్నీగా మాట్లాడుతూ ఎంతో జోయల్ గా ఉంటాడు. అంతేకాకుండా ఎవరితోనో ఎలాంటి పర్సనల్ గొడవలు లాంటివి ఏమి పెట్టుకోడు. ఓపెన్ గానే తన మనసులో ఉన్న‌ది చెప్పేస్తూ ఉంటాడు. ఇదే స‌మ‌యంలో రీసెంట్గా అల్లు అర్జున్ ఓ ఈవెంట్లో పాల్గొని తన మొదటి ప్రేమ గురించి ఓపెన్‌గా చెప్పేసాడు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఆయనకు పూర్తి రివర్స్ గా ఉంటూ చాలా రిజర్వుడ్‌గా ఉంటుందట.

భార్యకు పూర్తిగా ఆపోజిట్ అయిన అల్లు అర్జున్.. కొన్ని కొన్ని సార్లు పలు ఈవెంట్లలో, షోలో కామెడీగా సెటైరికల్‌గా హీరోయిన్లపై కామెంట్లు చేయడం, పర్సనల్ విషయాలను బయటపెట్టడం వంటివి స్నేహ రెడ్డికి అసలు ఇష్టం ఉండవట. ఇదే స‌మ‌యంలో రీసెంట్గా ఆహా టాక్‌షోలో వచ్చిన ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ ఫైనల్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.

ఈ షోలో తన మొదటి ప్రేమ గురించి చెప్పినందుకు అల్లు అర్జున్‌తో ఏకంగా స్నేహరెడ్డి రెండు రోజులు మాట్లాడలేదట. దీంతో పాటు ఇంట్లో చిన్న చిన్న చిలిపి త‌గాదాలు, గొడ‌వ‌లు వ‌స్తే కూడా స్నేహా రెండు రోజుల పాటు బ‌న్నీతో ఎడ‌మొఖం.. పెడ‌మొఖంగా ఉంటూ మాట్లాడ‌ద‌ట‌. ఆ త‌ర్వాత అన్నీ మ‌ర్చిపోయి.. మ‌ళ్లీ క‌లిసిపోతుంద‌ట‌.