ఆసియన్ సినిమాస్ సంస్థ నిర్మించిన లేటెస్ట్ మల్టీ ఫ్లెక్స్ త్రిబుల్ ఏ. అమీర్‌పేట సత్యం థియేటర్ ప్రాంగణంలో ఈ మల్టీఫ్లెక్స్ నిర్మించింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భాగస్వామి. అయితే అంతకు ముందే అదే ఏసియన్ సంస్థ మహేష్‌బాబుతో కలిసి ఏఎంబీ మల్టీఫ్లెక్స్ నిర్మించింది. ఇది రాకముందు వరకు హైదరాబాద్‌లో సినిమా థియేటర్ అంటే ప్రసాద్ ఐమాక్స్ నే. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌ను ఏఎంబీ ఆక్రమించింది.
మళ్లీ అదే ఏసియన్ సంస్థ నిర్మిస్తోన్న మల్టీఫ్లెక్స్.. అందులోనూ అల్లు అర్జున్ భాగస్వామి అంటే చాలా బజ్, క్రేజ్ వచ్చింది. పైగా సిటీకి గుండెకాయ లాంటి అమీర్‌పేట ప్రాంతం కావడంతో మహేష్‌బాబు ఏఎంబీని మించి ఏఏఏ థియేటర్లు ఉంటాయనుకున్నారు అందరూ..! అయితే ఇప్పుడు మహేష్ ఏఎంబీ ముందు బన్నీ ఏఏఏ అస్సలు ఆనడం లేదంటున్నారు.
కేవలం బన్నీ ఏఏఏ మల్టీఫ్లెక్స్ మంచి సెంటర్లో ఉందన్న మాట తప్పా ఏఎంబీతో పోలిస్తే అన్నింట్లోనూ డౌనే అంటున్నారు. హైదరాబాద్‌కు గుండెకాయ లాంటి వెంగళరావు నగర్, ఎస్ ఆర్ నగర్, మోతీ నగర్, యూసఫ్ గుడా, కృష్ణానగర్ వరకు సరైన మల్టీఫ్లెక్స్ గా ఏర్పాటు అయ్యింది. చుట్టుపక్కల విపరీతమైన స్టూడెంట్స్, హాస్టల్స్, బాగా పబ్లిక్ ఉంటారు. ఏఎంబీతో పోల్చుకుంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ.
ఇక విపరీతమైన ట్రాఫిక్ సమస్య, సినిమా వదిలాక బయటకు వచ్చేందుకు ఉన్న ఒకే ఒక్క దారి… రాంగ్ రూట్లో వచ్చేయడాలు.. సరైన పార్కింగ్ లేకపోవడం ఇలా అన్ని విధాలా ఇబ్బందిగానే ఉందంటున్నారు. ఇక ఏఎంబీలో డెడికేటెడ్ లిఫ్ట్ లు ఉంటే.. ఏఏఏలో మాల్ లిఫ్ట్ లు మాత్రమే ఉన్నాయట. దీంతో ఇక్కడ పావుగంటకు పైగా వేచి వుండాల్సి వస్తోందట.
ఎఎంబి కి విశాలమైన స్థలం, అన్ని సౌకర్యంగా ఉంటే… ఏఏఏ స్థలం చాలా తక్కువ కావడంతో అన్నింటా ఇబ్బందే అంటున్నారు. ఏఏఏలో అన్నీ స్క్రీన్లు ఒకేసారి వదిలితే అసలు బయటకు వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అంటున్నారు. ఏఎంబీ ఇంటీరియర్ అమేజింగ్.. ఏఏఏలో విపరీతంగా ఎల్ఈడీలు వాడడంతో అంత ఇంపుగా లేదంటున్నారు.
ఇక ఏఏఏ స్క్రీన్ల విషయానికి వస్తే స్క్రీన్ వన్ కు ఫస్ట్ మార్క్ లు వేయొచ్చు. స్క్రీన్ 4 కు లాస్ట్ మార్క్‌లు ఉంటాయి. ఇక కొన్ని స్క్రీన్లలో సీట్ల మధ్య లెగ్స్పేస్ కూడా తక్కువే. ఓవరాల్‌గా ఏఎంబీ అట్రాక్షన్ ముందు బన్నీ ఏఏఏ జుజుబీ అని తేలిపోయింది.