మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది.. అసలు విషయం ఏమిటంటే మెగా కోడలు ఉపాసన మరికొద్ది గంటలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందా..? అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఈ మెగా కోడలకు డెలివరీ టైం కి ఇంకా సమయం ఉండగానే ప్రస్తుతం నొప్పులు రావడంతో అమెను హాస్పటల్లో జాయిన్ చేశారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే వార్త గతంలోనే ఆయన అఫీషియల్ గా ప్రకటించాడు. ఇక ఈ క్రమంలోనే తన భార్య ఉపాసనకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గానే ఉపాసనకు ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా సీమంతపు వేడుకలు కూడా జరిపించారు.
అలాగే తన మరిది వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకల్లో కూడా ఉపాసన ఎంతో క్యూట్ గా కనిపించింది. రీసెంట్ గానే ఆమెకు తొమ్మిదో నెల రావడంతో ఆమె డెలివరీ సమయానికి మరింత సమయం ఉండగానే ఇప్పుడు పురిటి నొప్పులు రావడంతో ఆమెను అపోలో హాస్పటల్లో జాయిన్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో మెగా అభిమానులు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు.
మరికొద్ది గంటలోనే బుల్లి మెగాస్టార్ రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక మరి ఉపాసన డెలివరీ కి సంబంధించి వైరల్ అవుతున్న ఈ వార్తపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..?