పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న ‘బ్రో’ ట్రయిలర్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కలయికలో ఫాంటసీ కామెడీ యాక్షన్ గా తెరకెక్కిన బ్రో సినిమాకు కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో ముందు నుంచి ఉంది.
ఎందుకంటే ఆల్రెడీ తమిళ కథ అందరికి తెలిసిందే. ఈ సబ్జెక్ట్ కాస్త డ్రయ్ గా ఉంటుందన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ కథ పవన్‌కు ఎంతమేర సెట్ అవుతుందన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. అయితే దీనిని త్రివిక్రమ్ టోటల్‌గా కమర్షియల్ టచ్ ఇచ్చేసి మార్చేసినట్టే కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే అది చెప్పకనే చెప్పేసింది.
పవన్ చేసేది దేవుడి పాత్రే అయినా దానిని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ గా మార్చేశారు. పవన్ అయితే చాలా చలాకీగా, హుషారుగా కనిపించాడు. పైగా పాత సినిమాల స్టైల్స్, టచ్ ఇస్తూ సినిమాకు పవనే మెయిన్ హీరో అన్న ఫీలర్లు ట్రైలర్లో వదిలారు. అయితే సినిమా కథ ఎక్కువుగా నడిచేది సాయిధరమ్ తేజ్ మీద. సినిమా యాక్షన్, కామెడీ, ఎమోషనల్ బేస్‌గా నడుస్తోందని తేలిపోయింది.
ట్రైలర్ అయితే బాగానే కట్ చేశారు. పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మార్క్ పంచలు అయితే ట్రైలర్లో పడలేదు. కథను కమర్షియల్‌గా మార్చడంలో సక్సెస్ అయిన త్రివిక్రమ్ డైలాగుల విషయంలో పెద్దగా కాన్సంట్రేషన్ చేయలేదనే తెలుస్తోంది. బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తణికెళ్లభరణి, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా… పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించాయి. ఈ నెల 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.