జూనియ‌ర్‌ ఎన్టీఆర్ కెరీర్‌లో రిలీజ్ అవ్వ‌ని ఒకే ఒక సినిమా ఉందని తెలుసా..!

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ సృష్టించుకున్నాడు. రూపంలో తాత ఎన్టీఆర్‌ పోలికలే కాదు… అభినయంలోను తాత ఎన్టీఆర్‌ వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు జూనియర్. తారక్ చిన్నపుడు బాల‌ రామాయణం సినిమాలో రాముడిగా న‌టించి మెప్పించాడు.

ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టూడెంట్ నెంబ‌ర్ 1, ఆది, సింహాద్రి లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరో అయిపోయాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో న‌టించిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ రిలీజ్ అవ్వ‌లేద‌ట‌. నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు క‌లిసి నటించిన ఈ సినిమా ఇప్ప‌ట‌కి రీలీజ్ కాక‌పోవ‌డం విచిత్రం అనే చెప్పాలి.

ఇంత‌కు ఆ సినిమా ఏదంటే… సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ . ఆ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ‌స్ట్ టైం భరతుడి పాత్ర‌ కోసం మొదటిసారి ఎన్టీఆర్‌ మొఖానికి రంగేసు కున్నాడు. తెలుగు వెర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుశ్శంతుడుగా కూడా న‌టించాడు. బాల‌య్య హిందీలోనూ అదే వేషం వేశాడు.

హిందీ వెర్ష‌న్‌లో దుశ్యంతుడు కొడుకైన భరతుడిగా చిన్న ఎన్టీఆర్ న‌టించాడు. తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ వెర్షన్ షూటింగ్ మొత్తం పూర్త‌యినా రిలీజ్ చేయ‌లేద‌ట‌. ఆ త‌ర్వాత సీనియ‌ర్‌ ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడంతో ఈ సినిమా గురించి మ‌ర్చిపోయారు. అలా హిందీ బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర ఇప్ప‌ట‌కీ రిలీజ్ కాలేదు.