భార్య‌ను ప‌క్క‌న పెట్టుకుని ఆ స్టార్ హీరోయిన్‌ను ట్రై చేస్తా అన్న స్టార్ హీరో…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన మాధురి దీక్షిత్ గురించి పరిచయం అక్క‌ర్లేదు. త‌న అందం అభినయంతో పాటు మంచి డాన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. మాధురి దీక్షిత్ అంటే చిన్న.. పెద్దా తేడా లేకుండా చాలామంది ఇష్టపడుతుంటారు. పెళై పిల్లలు పుట్టి 50 సంవత్సరాల వ‌య‌సు వ‌చ్చినా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది మాదురి. 1990లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్ల‌కు పరుగులు తీసేవారు.

డాన్సింగ్ క్వీన్ అనే బిరుదును సంపాదించుకున్న మాధురి దీక్షిత్ అందం, అభినయాన్ని చూస్తే సగటు ప్రేక్షకులే కాకుండా స్టార్ హీరోయిన్లు కూడా స్టన్ అయిపోవాల్సిందే. మాధురి దీక్షిత్‌తో నటించిన స్టార్ హీరోలు అందరూ ఎప్పుడు ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తూనే ఉంటారు. తాజాగా ఒక స్టార్ హీరో అతడి భార్య పక్కనే ఉండగానే మాధురి దీక్షిత్ కి లైన్ వేస్తా.. నాకు పెళ్లి కాకపోయే ఉంటే మాధురి దీక్షిత్‌కే లైన్ వేసి పెళ్లి చేసుకునే వాడినని చెప్పాడు.

ఇంతకీ ఎవరు? ఆ స్టార్ హీరో అనుకుంటున్నారా. 1980 – 90 ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ స్టార్ హీరో గోవిందా. తాజాగా తన భార్య సునీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోవిందాను మీ ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు గోవింద భార్య మాట్లాడుతూ ఆయన మాధురిని బాగా ఇష్టపడతార‌ని చెప్పింది. ఆ వెంటనే గోవిందా మాట అందుకుని రేఖను కూడా.. ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరూ ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా తమ కెరియర్ లో దూసుకుపోతున్నారు. వీరి శరీరం మాత్రమే కాదు.. మనసులు కూడా ఎంతో అందంగా ఉంటాని చెప్పాడు.

వీరు కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే అంతే ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. సునీ లేకపోయి ఉంటే నేను మాధురి దీక్షిత్ కే లైన్ వేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. మాధురి దీక్షిత్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. మాధురి – గోవిందా కాంబోలో పాప్‌కా అంత్, ఇజ్జత్ దార్, బడే మియా చోటే మియా, మహాసంగ్రామ్ లాంటి సినిమాలు వ‌చ్చి సూపర్ హిట్ అయ్యాయి.