ఆమె బాలీవుడ్లో ఒక స్టార్ హీరోయిన్. ఆమె ఓ స్టార్ డైరెక్టర్‌ను పెళ్లాడి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మరో ప్రియుడితో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. అయినా కూడా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె గురించి ఇప్పటి వరకు ఆన్సర్లు లేని రెండు ప్రశ్నలకు రీసెంట్గా జవాబు ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు
కల్కి కొచ్లిన్. ఓ బిడ్డకు జన్మనిచ్చిన కల్కి ఇప్పటి వరకు ఎందుకు ? పెళ్లి చేసుకోవడం లేదు ? ఇక రెండో ప్రశ్న ఆమె ముంబైను ఎందుకు వదిలేసి గోవాలో ఉంటుందన్నది ఇప్పటి వరకు ఎవ్వరికి అంతు పట్టడం లేదు.
అయితే ఈ రెండు ప్రశ్నలకు ఆమె తన తాజా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసింది. తనకు పెళ్లిపై .. అసలు ఆ వ్యవస్థపైనే నమ్మకం పోయిందని చెప్పింది. ఈ బ్యూటీ ముందుగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం హ్యాష్ బర్గ్ కు దగ్గరై.. అతడితో ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఇది జరిగి కూడా మూడేళ్లు అవుతోంది.
ఆ తర్వాత కూడా పెళ్లి కాకుండానే తల్లి అయినందుకు ఆమెపై విమర్శలు వచ్చాయి. అసలు ఆమె ముంబై వదిలేసి గోవాలో ఉంటోంది. వీటిపై ఇప్పుడు స్పందించింది. విడాకుల తర్వాత తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం పోయింద.. ఇక తన భాయ్ ఫ్రెండ్ కు కూడా పెళ్లిపై ఆసక్తి లేకపోవడంతో.. సహజీవనంలోనే ఉండిపోయామని చెప్పింది.
ఇక సినీ నటులు ఎవరైనా ముంబయిలోనే ఉంటారు. కల్కి ముంబయి వదిలి గోవాలో ఉంటోంది. తాను తన ప్రియుడిని ఫస్ట్ టైం ఇజ్రాయెల్‌లో కలుసుకున్నానని… మా ఇద్దరికి పచ్చదనం ఇష్టం కావడంతో.. తన కూతుర్ని కూడా ప్రకృతి మధ్య పెంచేందుకు గోవాకు షిఫ్ట్ అయినట్టు ఆమె చెప్పింది.