గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మెగా హీరో వరుణ్‌తేజ్, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వీళ్ల ఎంగేజ్మెంట్ ఈ నెల 9న జరుగుతుందని.. హైదరాబాద్‌లో ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని.. ఆ రోజు మెగా హీరోలు అందరూ షూటింగ్‌కు హాలీడే కూడా ఇస్తున్నారని ఒక్కటే వార్తలు వచ్చేశాయి.
అయితే తాజాగా వీరిద్దరి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసినట్టుగా తెలుస్తోంది. వీరి ఎంగేజ్మెంట్ ఈ నెల 9న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో జరగబోతోందట. దీనిపై జనసేన మెంబర్ ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా కన్‌ఫార్మ్ చేశారు. వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
ఈ కొత్త జంటకు కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెబుతూ వాళ్ళ ఫోటోతో పాటు వారి ఎంగేజ్మెంట్ కార్డు కూడా పోస్ట్ చేయడంతో పెళ్లిపై దాదాపు అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. ఈ వార్త ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. మెగాభిమానులు, జనసేన అభిమానులు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో వరుణ్ – లావణ్య జంటకు విషెస్ చెపుతున్నారు.
ఇక వరుణ్ – లావణ్య మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని అంటారు. ఆ తర్వాత వీరు మరోసారి అంతరిక్షం సినిమాలోనూ జోడీ కట్టారు.