బిగ్ బ్రేకింగ్: “భగవంత్ లాల్ కేసరి” గా బాలయ్య.. NBK 108 టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. !!

అబ్బబ్బా.. బాలయ్య టైమింగ్ కి రైమింగ్ కి అదిరిపోయే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశాడు అనిల్ రావిపూడి. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే రీసెంట్గా వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి నరసింహం గా పేరు సంపాదించుకున్న బాలయ్య . ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు జీన్స్ వేసుకుని క్లాస్ లుక్స్ .. మరో వైపు పంచ కట్టుకొని మాస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత బాలయ్యకే దక్కింది .

Balakrishna NBK108: Godspeed Becomes Industry Talk

కాగా వీరసింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్.బి.కె 108 . మల్టీ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఈ సినిమా మిగతా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇలాంటి క్రమంలోనే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని ఫిలిం చాంబర్లో కూడా రిజిస్టర్ చేశారట .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాకి “భగవంత్ లాల్ కేసరి” అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో బాలయ్య స్టన్నింగ్ రోల్ లో మెప్పించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమాల్లో బాలయ్య పేరు కూడా “భగవంత్ లాల్ కేసరి” అంటూ ఓ క్రేజీ టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్యకు భార్యగా నటిస్తూ ఉండగా శ్రీ లీల కూతురుగా నటించబోతుంది.

Crazy Movie Update From NBK108...

కూతురు అంటే అన్న కూతురు . ఈ సినిమా టైటిల్ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ చేస్తున్నారు . ఈ అప్డేట్ తో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు . వీరసింహారెడ్డి సినిమాతో ఎంత క్రేజ్ దక్కించుకున్నాడో అంతకు డబల్ రేంజ్ లో ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసిన అనీల్ రావిపూడి కి స్పెషల్ థాంక్స్ చెప్తున్నారు . అనిల్ రావిపూడి – బాలయ్య సినిమాకి సంబంధించిన టైటిల్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది..!!