చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా అనుష్కకు ఉండే క్రేజ్ వేరే లెవెల్.. సినిమాలో గ్లామర్ పాత్రలో నటించిన, పద్ధతిగా నిండైన చీరతో కనిపించే అనుష్క అంటే అభిమానులకు చాలా ఇష్టం. ఇదే క్రమంలో అనుష్క పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటే చూడాలని ఎందరో అభిమానులు ఆశపడుతున్నారు.. చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు కూడా దీనికోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అనుష్క మాత్రం మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొస్తూనే ఉంది.
ప్రభాస్ కూడా మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ ఓపెన్ అప్ అవుతూనే ఉన్నాడు. ఇదే క్రమంలో అనుష్క గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో అనుష్క తన క్రష్ గురించి బయట పెట్టింది. ఆయన ఎవరో కాదు అప్పట్లో క్రికెట్ టీం ని అల్లాడించిన రాహుల్ ద్రావిడ్. ఎస్ ఇప్పుడంటే అందరూ ధోని , విరాట్ కోహ్లీ అంటూ ఫాన్స్ గా చెప్పుకుంటున్నారు గాని.. అప్పట్లో అందరికీ కామన్ గా నచ్చిన వ్యక్తి రాహుల్ డ్రావిడ్.. బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తే చాలు ఫటా ఫటా అంటూ ఫోర్లు , సిక్స్ లు పోవాల్సిందే .
అలాంటి ఆటగాడు. కాగా ఆ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క ..రాహుల్ డ్రావిడ్ అంటే నాకు క్రష్ అని.. చచ్చేంత ఇష్టమని చెప్పుకొచ్చింది. అనుష్క ఫ్యాన్స్ మాత్రం కాస్త హట్ అయ్యారని తెలుస్తుంది. ప్రభాస్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు, ప్రభాస్ కూడా అంతే సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్నది మాత్రం కన్ఫామ్ అంటూ సినీ ప్రముఖులు కూడా ఫిక్స్ అయిపోయారు . చూద్దాం ఈ జంట ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో..?