టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఏకంగా ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మించిన విజయ్ వారసుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ల వార్ ఎలా జరిగిందో చూశాం. ఇక ఇప్పుడు దసరా కానుకగా మరో అదిరిపోయే ఫైట్‌కు రంగం సిద్ధమవుతోంది.
ఈ యేడాది అక్టోబర్ 19.. దసరా సీజన్.. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ భారీ సినిమా భగవత్ కేసరి విడుదల అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే రోజు తమిళ డబ్బింగ్ సినిమా లియో కూడా వస్తోంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో హీరో. పైగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.
గమ్మత్తేమిటంటే ఈ సినిమాను పంపిణీ చేస్తున్నది బాబీ-బాలయ్య సినిమా నిర్మాతలు సితార అధినేత కావడం విశేషం. ఇది ఆయనకు కాస్త ఇబ్బందే. ఇలా ఈ రెండు సినిమాలు అక్టోబర్ 19న బాక్సాఫీస్ దగ్గర ఢీకొంటున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మాస్ మహరాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా అప్పుడే వస్తోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఉండడంతో ఇది పక్కాగా వస్తుందా ? రాదా అన్నది క్లారిటీ లేదు.
ఇక రవితేజ సినిమా కూడా వస్తే బాలయ్య, విజయ్ సినిమాలకు పోటీగా రవితేజ కూడా ఉంటే దసరాకు గట్టి పోటీ తప్పదు. ఒక వేళ రవితేజ తప్పుకున్నా బాలయ్య, విజయ్ సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో గట్టి పోటీ తప్పదు. సంక్రాంతికి మాత్రం విజయ్ సినిమా కంటే బాలయ్య వీరసింహారెడ్డి పై చేయి సాధించింది.
మరి దసరాకు ఈ ఇద్దరి పోరులో ఎవరు ? పైచేయి సాధిస్తారో ? చూడాలి. ఒకవేళ రెండు సినిమాల పోటీ ఉంటే యావరేజ్ టాక్ వచ్చినా గట్టెక్కుతారు. అదే మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే యావరేజ్ టాక్ వచ్చిన సినిమా నిలదొక్కుకోలేదనే చెప్పాలి.