తెలుగు అమ్మాయిలు 30 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో చెప్ప‌డం వెన‌క ఇన్ని లాజిక్కులున్నాయా..!

ఫారిన్ కంట్రీలో 30 ఏళ్ల దాటిన అమ్మాయిలు సింగల్ గా ఉండడం అనేది చాలా కామన్. కానీ భారతదేశంలో కూడా ఇటీవ‌ల 30 ఏళ్ళు దాటిన ఇంకా వివాహం చేసుకోకుండా ఉంటున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది. ఓ పక్క చాలామంది అబ్బాయిలు 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదని బెంగపెట్టుకుంటుంటే.. అమ్మాయిలు మాత్రం అబ్బాయిలకు ఉద్యోగం సరిగా లేదని, ఆస్తిపాస్తులు లేవని, విదేశాలకు తీసుకువెళ్లలేడ‌న్న‌ సాకులతో వారికి నో చెప్పేస్తున్నారు.

ఇక అమ్మాయిలేమో ఉత్తమ చదవులు చదువుకోవాలి, ఫారిన్ కంట్రీస్‌లో సెటిల్ అవ్వాలని ఉద్దేశంతో 30 ఏళ్లు దాటినా కూడా చదువులపై, ఉద్యోగాలపై కాన్సన్ట్రేషన్ చేస్తూ పెళ్లిలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది ఆడ‌పిల్ల‌లు 30 ఏళ్ళు వ‌చ్చినా పెళ్లి చేసుకుంటే భ‌ర్త ద‌గ్గ‌ర బందిగా ఉండాలి… మా స్వేచ్ఛ పోతుంది.. అనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకోవడం లేద‌ట‌.

ఇలాంటి ఆలోచనలు సిటీలో ఉన్న అమ్మాయిల దగ్గర ఎక్కువ‌గా వినిపిస్తుంటే.. విలేజి అమ్మాయిలేమో తాము పెళ్లి చేసుకునే అబ్బాయిలు హీరోలా ఉండాలని, ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉండాలని, అక్కడకు ఇక్కడకు తిప్పాలని కోరికతో తమను అర్థం చేసుకుని బాగా చూసుకునే వారు దొరకాలంటూ.. వచ్చిన సంబంధాలను చెడగొట్టుకుంటూ 30 దాటినా పెళ్లిళ్లు చేసుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోకుండా తెలుగు అమ్మాయిలు హ్యాపీగానే ఉంటున్నారా అంటే 90 శాతం మంది అవునని అంటున్నారు. ఇది వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి వారికి కరెక్ట్ అనిపిస్తుంది. కాని ఇలాంటి పరిస్థితిని పాశ్చాత్య దేశాల్లో అయితే అంతగా పట్టించుకోరు. తెలుగు వారు మాత్రం 30ఏళ్ళు దాటిన తర్వాత కూడా అమ్మాయి వివాహం చేసుకో లేదంటే ఆమెను చిన్నచూపు చూస్తూ ఉంటారు. అయినా సరే చాలామంది అమ్మాయిలు అలాంటి వారి ధోరణిని పట్టించుకోకుండా తమ ఇండిపెండెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.