తన తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుని యువతలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కృతి శెట్టి . ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేయబోతుందా..? అంటే అవునుఅనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆమె చివరిగా నటించిన కస్టడి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆమె తన తర్వాత సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే తెలుగులో ఒక అవకాశం కూడా దక్కించుకోలేకపోతున్న కృతి శెట్టి. కోలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లు అందుకుంటుంది.
ఇప్పటికే ఇద్దరు కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో కృతి శెట్టి హీరోయిన్‌గా కన్ఫామ్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఇదే సమయంలో కృతి శెట్టి మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌స్టార్ దర్శకుడు డైరెక్షన్లో వచ్చేే సినిమాలో ఈ అమ్మడు ఐటమ్ గర్ల్ గా నటించడానికి ఒకే చెప్పిందట. ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతేకాకుండా ఆ సాంగ్ కోసం ఈ అమ్మడు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ కూడా అందుకోనున్నట్టు తెలుస్తుంది. అసలే వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్ప కృతి శెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రస్తుతం తన పేరును ఇండస్ట్రీలో వినిపించేలా చేయాలనే ఉద్దేశంతో అది ఐటమ్ గర్ల్ గానా..? హీరోయిన్ గానా..? అనేది పక్కనపెట్టి ఈమె తీసుకున్న నిర్ణయం మంచిదే అంటూ కృతిని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ నిర్ణయం కృతి శెట్టికి ఏం మాత్రం కలిసి వస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!!