‘ పుష్ప 2 ‘ లీక్స్‌… పుష్ప 1 కు నాలుగు రెట్లు బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా ..!

ప్ర‌స్తుతం చిరులీక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి త‌న‌ కొత్త సినిమాల సంగతుల్ని, అందరికంటే ముందు లీక్ చేసేస్తున్నారు. రీసెంట్‌గా భోళాశంకర్ లో పవన్ ను ఇమిటేట్ చేసిన విషయాన్ని కూడా చిరంజీవి ముందుగానే లీక్ చేశారు. పైగా ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌కు ఇదంతా తెలిస్తే ఊరుకోడు.. అయినా త‌ప్ప‌ట్లేదు అంటూ స‌ర‌దాగా చెపుతూనే ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన వీడియో బ‌య‌ట‌కు వ‌దిలేశారు.

ఇది నిజంగానే సినిమాకు చాలా హైప్ తీసుకు వ‌చ్చింది. అయితే ఇప్పుడు మ‌రో లీకు మొద‌లైంది. అయితే ఈ సారి వంతు బ‌న్నీది. సుకుమార్ దర్శకత్వంలో బ‌న్నీ పుష్ప-2 సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్-1 పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో చూశాం. దీంతో ఇప్పుడు పార్ట్-2పై అంచనాలు మామూలుగా లేవు.

సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో పుష్ప 2 సెట్స్ నుంచి ఆ వ‌ర్కింగ్ స్టిల్స్ అయితే లీక్ అవుతున్నాయి. ఏకంగా బ‌న్నీయే ఇప్పుడు త‌న సినిమా నుంచి అదిరిపోయే లీక్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ను బ‌య‌ట పెట్టేశాడు. బేబీ సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ఈవెంట్‌కు వ‌చ్చిన బ‌న్నీ ఈ డైలాగ్ చెప్పేశాడు.

“సినిమా పేరు పుష్ప-2, ది రూల్. ఒకటే ముక్క ఉంటుంది. బయటకు చెబుతానని తాను అనుకోలేదంటూనే చెప్పేశాడు… ” ఈడంతా జరిగేది ఒకటే రూలు మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్ ” అని ఆ డైలాగ్ చెప్పేశాడు. ఇది చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే పార్ట్ 1లో త‌గ్గేదేలే డైలాగ్‌ను మించి ఉంద‌ని చెప్పాలి. ఈ ఊపు చూస్తుంటే పుష్ప 1ను మించిన నాలుగు రెట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ పుష్ప 2 కొడుతుంద‌నేంత హైప్ అయితే క్రియేట్ అయ్యింది.