ప్రఖ్యాత తమిళ దర్శకుడు బాలు మహేంద్ర. కథా రచయితగా అరంగేట్రం చేసిన కరుణానిధి శిష్యుడిగా బాలుకుమంచి పేరుంది. ఆయన తెలుగు సినిమాలు అనేకం చేశారు. భానుచందర్‌కు మంచి పేరు తెచ్చిన నిరీక్షణ సినిమాకు బాలు మహేంద్రే దర్శకుడు. అదేవిధంగా సంధ్యారాగం సినిమాను కూడా ఆయనే తీశారు. ఇక, చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మనవూరి పాండవులు సినిమాకు సినిమా టోగ్రఫీ చేసింది కూడా బాలూ మహేంద్రే కావడం విశేషం.
తెలుగు చేసినవి ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ.. బాలు మహేంద్రకు మంచి పేరు అయితే.. వ చ్చింది. శోభన్‌బాబుతో ఒక సినిమాను ఆయన ప్లాన్ చేశారు. అయితే.. రెమ్యునరేషన్ విషయంలో తలెత్తి న వివాదంతో శోభన్‌బాబును బాలు మహేంద్ర పక్కన పెట్టారు. ఈ సినిమాకు హీరో కృష్ణను తీసుకోవాలని.. ఆయన పద్మాలయా స్టూడియోకు వెళ్లారు. అయితే.. బాలు మహేంద్రతో సినిమా చేయాలని ఉన్నా.. ఒక హీరో కాదన్న కథను చేయనని హీరో కృష్ణ చెప్పారు.
దీంతో బాలు మహేంద్ర మరో కొత్త కథతో వస్తానని చెప్పి వెళ్లారు. ఆ తర్వాత చాన్నాళ్లకు బాలు మహేంద్ర వచ్చినా.. అప్పటికి హీరో కృష్ణ బిజీ అయిపోయారు. దీంతో ఆయనను కలవలేక పోయారు బాలు మహేం ద్ర. అయితే గూఢచారి 116 నుంచి దొంగలకు దొంగ వరకు అనేక సినిమాలు తాను చూశానని.. తాను కృష్ణ కు వీరాభిమానని బాలు మహేంద్ర అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, కృష్ణతో మాత్రం ఆయన కోరిక నెరవేరక పోవడం గమనార్హం.