ఈ విషయం తెలిస్తే బాలయ్యకు దండం పెడతారు.. ఆ హీరోలు ఎవరూ బాలయ్యకు సాటి రారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో పోలిస్తే బాలయ్య భిన్నంగా ఉంటారు. కొంతమంది బాలయ్య భోళా మనిషి అని, కోపిష్టి అని కామెంట్ చేసినా బాలయ్య మాత్రం ఆ నెగిటివ్ కామెంట్లను అస్సలు పట్టించుకోరు. ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న బాలయ్య ఆ డబ్బులో ఎక్కువ మొత్తన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.

వినడానికి ఆశ్చర్యానికి కనిపించినా బసవతారకం ఆస్పత్రి ద్వారా చికిత్స చేయించుకోలేని పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీల ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది హీరోలు 10,000 రూపాయలు సాయం చేసినా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటారు.

అయితే బాలయ్య మాత్రం ప్రచారాన్ని పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా నమ్మిన దర్శకులకు ఛాన్స్ ఇస్తూ బాలయ్య మంచితనాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. యంగ్ జనరేషన్ హీరోలతో బాలయ్య స్థాయిలో క్లోజ్ గా మెలుగుతున్న మరో హీరో లేరనే చెప్పాలి. కమర్షియల్ యాడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య ఆ యాడ్స్ ద్వారా కూడా సత్తా చాటుతున్నారు.

రియల్ ఎస్టేట్ యాడ్స్ తో పాటు జ్యూవెలరీ యాడ్స్ లో కనిపిస్తున్న బాలయ్య ఈ యాడ్స్ తో కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. బాలయ్య పైకి సింపుల్ గా కనిపించినా ఆయనతో మాట్లాడితే ఎంతో జ్ఞానం వస్తుందని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతున్నారు. బాలయ్య మంచితనం విషయంలో ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విషయాలకు సంబంధించి చరిత్ర సృష్టించలన్నా చరిత్ర తిరగరాయాలన్నా బాలయ్యకే సాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి.