నటరత్న ఎన్టీఆర్ ఐదో వారసుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలయ్య తన కెరీర్లు ఇప్పటివరకు 107 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సంక్రాంతి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ ను ఉచ్చ కోత కోశాడు. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే గత నాలుగు దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని కొత్త బాలయ్యని ఇటీవల కాలంలో చూస్తున్నాం. యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలతో వారికి గట్టి పోటీ చేస్తున్నాడు అదేవిధంగా.. అదేవిధంగా అన్‌స్టాపబుల్ టాక్ షో తో లక్షలాది మంది అభిమానులకి తనలోని కొత్త బాలయ్యను పరిచయం చేసి బాగా దగ్గరయ్యాడు.
అలాంటి బాలయ్య ఆయన భార్య వసుంధర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య భార్య వసుంధర పెళ్లయినప్పటి నుంచి మంచి గృహిణిగా మాత్రమే ఉంటూ వచ్చింది. ఆమె పెద్దగా ఎప్పుడు బయట కనిపించింది కూడా లేదు. మిగిలిన హీరోల భార్యలు ఎలాంటి ఏ ఫంక్షన్ జరిగినా వారి భర్తలతో కలిసి వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేందుకు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు.
అయితే వసుంధర దేవి మాత్రం ఎప్పుడు ఇంటికే పరిమితం అవుతుంది. ఆమెకు బాలయ్య సినిమా వ్యవహారాలు అసలు పట్టవు. తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఎంతో హ్యాపీగా తన లైఫ్ను కొనసాగిస్తుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే బాలయ్య భార్య వసుంధరది గోల్డెన్ హ్యాండ్.. ఆమె చేత్తో డబ్బులు ఇస్తే ఎవరికైనా బాగా కలిసొస్తుందన్న ఓ సెంటిమెంట్ ఉంది. బాలయ్యతో సినిమా చేసే నిర్మాతలు ముందుగా వసుంధర దగ్గరకు వచ్చి ఆమె చేత్తో లక్ష రూపాయలు తీసుకుంటారట.
ఆమె చేతో డబ్బులు ఇస్తే చాలామందికి కలిసి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆమెది గోల్డెన్ హ్యాండ్ అంటారు. బాలకృష్ణ కూడా రోజు బయటకు వచ్చే ముందు ఆమె ఎదురు వచ్చాక బయటకు వస్తారట. ఇది బాలయ్య భార్య వసుంధరకు ఉన్న గోల్డెన్ హాండ్స్ సెంటిమెంట్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.