నందమూరి నటసింహం బాలయ్య జోష్ మామూలుగా లేదు. బాలయ్య ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. బాలయ్య 63వ వడిలోకి ఎంటర్ కాబోతున్నాడు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా బాలయ్యకు శుభాకాంక్షలతో హోరెత్తుతోంది. ఈ రోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా మూడు రోజుల ముందే బాలయ్య కొత్త సినిమా టైటిల్ భగవంత్ కేసరి రిలీజ్ చేశారు.
ఇక ఈ రోజు వదిలిన టీజర్ కూడా గూస్‌బంప్స్ మోత తెప్పిస్తోంది. అయితే ఈ తరం జనరేషన్‌లో ఏ టాలీవుడ్ హీరోకు లేని అరుదైన రికార్డ్ బాలయ్యకు సొంతమైంది. బాలయ్య తన కెరీర్‌లో డ్యూయల్ రోల్లో చాలా సినిమాల్లో నటించాడు. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో బాలయ్య చేసిన ఎక్కువ సినిమాలు డ్యూయల్ రోల్లోవే కావడం విశేషం.
ఒక వేళ పాత్ర ఒకటే అయినా రెండు డిపరెంట్ వేరియేషన్స్‌తో ఉంటోంది. బాలయ్య ఏకంగా 20 సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించాడు. బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే బాలయ్య కవల సోదరుడిగా, తండ్రి తనయుడిగా, తాతా మనవళ్లుగా, బావ బావమరుదులుగా, రాజు సామాన్యుడిగా, భగవంతుడు భక్తుడిగా ఇలా ఇన్ని పాత్రల్లో నటించారు.
ఇలా ఈ తరహా పాత్రలలో ఇంత వైవిధ్యంగా నటించిన ఘనత వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణకే దక్కుతుందనడంలో సందేహం లేదు. ఇక బాలయ్య 109వ ప్రాజెక్టు కూడా కొల్లి బాబి దర్శకత్వంలో బర్త్ డే కానుకగా ప్రారంభమైంది.