నేడు టాలీవుడ్ నట సింహంగా పాపులారిటి సంపాదించుకున్న బాలయ్య పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియా వేదికగా నందమూరి ఫ్యాన్స్.. సినీ స్టార్స్.. రాజకీయ ప్రముఖులు ..ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య పేరును సరికొత్త హ్స్ష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు . ఇలాంటి క్రమంలోనే నందమూరి బాలయ్య కోసం స్పెషల్ ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశాడు.
స్టార్ సింగర్ నోయల్ – బాలకృష్ణ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఓ పాట పాడి రిలీజ్ చేశారు. గాయకుడు నోయల్ సేన్ రాసి పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. మరి ముఖ్యంగా నోయల్ రాసిన పదాలు బాలయ్య ఫిజిక్‌కి..బాలయ్య మంచితనానికి ఆప్ట్ గా సెట్ అయ్యాయి.
“అంతేకాదు ఇప్పటివరకు నీ రికార్డులను తలదన్ని.. బద్దలు కొట్టే మొనగాడు మగాడు ఇండస్ట్రీలో పుట్టలేదు “అంటూ నోయల్ రాసిన పదాలు నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నోయల్ సేన్ ఎంతో ప్రేమతో రాసిన ఈ పాటకు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడు. కొద్దిసేపటికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట ను రిలీజ్ చేశాడు నోయల్. ఈ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి ఎందుకు ఆల్స్యం మీరు ఈ పాట పై ఓ లుక్కేయ్యండీ..!!