బాల‌య్య 108వ టైటిల్ వ‌చ్చేసింది.. అన్నదిగిండు.. ఊచ‌కోత షురూ అంటూ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ భ‌గ‌వ‌త్ కేస‌రి. టాలీవుడ్‌లో గ‌త ఆరు సినిమాలుగా ఓట‌మి లేకుండా సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను త‌న అంద‌చందాల‌తో ఊపేస్తోన్న యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా బాల‌య్య కూతురు పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ పాత్ర సినిమాను మ‌లుపు తిప్పేదిగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక ఈ మాసీవ్ ప్రాజెక్ట్ టైటిల్ విష‌యంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఊరిస్తూ వ‌స్తోన్న వార్త‌లే నిజం అయ్యాయి. ఎట్ట‌కేల‌కు భ‌గ‌వ‌త్ కేస‌రి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

పైగా ఈ సినిమా టైటిల్ తెలుగు రాష్ట్రాల్లో నెవర్ బిఫోర్ ప్లానింగ్‌తో మేకర్స్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమా 108 హోర్డింగ్స్‌తో పవర్ ఫుల్ టైటిల్ “భగవత్ కేసరి” గా అనౌన్స్ చేశారు. అస‌లు టైటిల్ అలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో సోష‌ల్ మీడియాలో అయితే బాల‌య్య‌, నంద‌మూరి ఫ్యాన్స్ ట్రెండింగ్ మామూలుగా లేదు. దీనిపై అధికారికంగా షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ మోత మోగిపోతోంది.

బాల‌య్య రౌద్ర ర‌సంతో ప‌దునైన క‌త్తిని భూమిలోకి దించుతున్న స్టిల్ అయితే అరాచ‌కం అన్న‌ట్టుగా ఉంది.
పోస్ట‌ర్ అయితే నెక్ట్స్ లెవ‌ల్లో ఉంది. ఇక టైటిల్ రిలీజ్ చేసిన షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ అన్న‌దిగిండు.. ఇక మాస్ ఊచ‌కోత షురూ అని పెట్టిన క్యాప్ష‌న్ నిజంగానే ఊచ‌కోత కోస్తున్న‌ట్టుగా ఉంది. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.